పండుగ రోజున ఏలూరులో ఘోరం.. స్కూటీపై బాణసంచా తీసుకెళ్తుండగా పేలుడు, ఒకరు మృతి..

గాయపడ్డ వారికి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

పండుగ రోజున ఏలూరులో ఘోరం.. స్కూటీపై బాణసంచా తీసుకెళ్తుండగా పేలుడు, ఒకరు మృతి..

Updated On : October 31, 2024 / 5:40 PM IST

Eluru Fireworks Explosion : దీపావళి పండుగ రోజున ఏలూరులో ఘోర ప్రమాదం జరిగింది. ఏలూరు తూర్పు వీధి గౌరమ్మ గుడి వద్ద బాణసంచా పేలి ఒక వ్యక్తి మరణించగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు వ్యక్తులు క్రాకర్స్ కొని స్కూటీపై తీసుకుని వెళ్తుండగా.. ఈ ఘోర ప్రమాదం జరిగింది. బైక్ గోతిలో పడటంతో వారి వద్ద ఉన్న బాణసంచా కిందపడిపోయి ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బైక్ పై ఉన్న దుర్గా సాయి, సుధాకర్ స్పాట్ లోనే మరణించారు. గాయపడ్డ వారికి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

”ఇద్దరు వ్యక్తులు గోనె సంచిలో బాణసంచా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న గోతిలో బండి పడింది. దీంతో ఒక్కసారిగా గోనెసంచిలోని టపాసులు రాపిడికి గురై పేలాయి. దీంతో ఓ వ్యక్తి స్పాట్ లోనే చనిపోయాడు. పేలుడు ధాటికి శరీరం ముక్కలైంది. సమీపంలో ఉన్న పలువురికి గాయాలయ్యాయి” అని స్థానికులు తెలిపారు.

ఈ ప్రమాదం దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంచిలో క్రాకర్స్ పెట్టుకుని ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళ్తున్నారు.. అదే సమయంలో రోడ్డు పక్కన కొందరు వ్యక్తులు నిలబడి మాట్లాడుకుంటున్నారు. సరిగా అదే సమయంలో బైక్ గోతిలో పడటం, సంచిలోని క్రాకర్స్ పేలిపోవడం, అక్కడ పెద్ద బ్లాస్టింగ్ జరగడం, పలువురు గాయపడటం.. ఇదంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది.

Also Read : ఏలూరు జిల్లాలో విషాదం.. బాణసంచా తయారీ కేంద్రం దగ్గర పిడుగు పడి ఇద్దరు మృతి..