హబ్సీగూడలో ఆర్టీసీ బస్సు బీభత్సం

హైదరాబాద్ లోని హబ్సిగూడ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు కొద్ది క్షణాల పాటు గందరగోళానికి గురి చేసింది. సిగ్నల్ పడగానే ఒక్కసారిగా బస్సు ముందుకు వచ్చింది. ఇదే సమయంలో ముందు ఉన్న కార్లు, బైకులను గుద్దింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవింగ్ చేస్తున్న తాత్కాలిక డ్రైవర్ పరారైయ్యాడు.
జనగాం డిపోకు చెందిన బస్సు జేబీఎస్ నుంచి బయల్దేరింది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బస్సు ఒక్కసారిగా కార్లను ఢీకొట్టడానికి కారణం బ్రేకులు ఫెయిలైన కారణమే అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎనిమిది మంది ప్రయాణికులు ఉండగా వారు సురక్షితంగానే ఉన్నారు. కార్లో ఉన్నవారికి, రోడ్లపై ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు చెబుతున్నారు.