నటి శ్రావణి కేసు.. నేడు కీలక విచారణ, పోలీసుల ముందుకు సాయి, RX100 నిర్మాత

Sravani Kondapalli Suicide news: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టీవీ నటి శ్రావణి సూసైడ్ కేసులో పోలీసులు నేడు(సెప్టెంబర్ 12,2020) కీలక విచారణ చేపట్టనున్నారు. పూటకో ట్విస్ట్.. గంటకో ఆడియో, వీడియో లీక్స్‌తో మిస్టరీని తలపిస్తున్న నటి శ్రావణి కేసును ఓ కొలిక్కి తెస్తున్నారు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు. కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌ను ఇప్పటికే పోలీసులు విచారించి కీలక ఆధారాలు సేకరించారు. మరోవైపు శ్రావణి స్నేహితుడు, నిర్మాత అశోక్‌రెడ్డిని ఇవాళ పోలీసులు విచారించనున్నారు.
శ్రావణి చావుకి కారణం ఎవరు?
టీవీ నటి శ్రావణి చావుకు కారకులెవరు..? దేవరాజ్ రెడ్డా.. లేక సాయి రెడ్డా..? అసలు RX 100 నిర్మాత పేరెందుకు వచ్చింది..? ఇలాంటి ప్రశ్నలతో శ్రావణి సూసైడ్ కేసు క్రైమ్ సీరియల్‌ను తలపిస్తోంది. రోజుకో ట్విస్టుతో పోలీసులకే పిచ్చెక్కిస్తోంది. తొలత దేవరాజ్‌ను నిందితుడిగా అనుమానించిన పోలీసులు అతన్ని విచారించారు. దేవరాజ్ అందించిన ఆధారాలతో ఇప్పుడు.. కేసు మొత్తం సాయి మెడకు చుట్టుకుంటోంది. హోటల్‌లో గొడవ జరిగిన రోజే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇవాళ సాయి, అశోక్ రెడ్డిని పోలీసులు విచారించిన తర్వాత ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు బయటకు రానున్నాయి.
శ్రావణి ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడు దేవరాజ్ అని అంతా భావించారు. కానీ కేసు మరో మలుపు తిరిగింది. తాను అమాయకుడిని అని చెప్పుకున్న సాయి మెడకు ఉచ్చు బిగుస్తోంది. దేవరాజ్ అందించిన సాక్ష్యాలు కేసును కీలక దశకు తీసుకువెళ్లింది. సాయి, అశోక్ రెడ్డిల విచారణ తర్వాత కేసులో అరెస్ట్ పర్వం కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు.
https://10tv.in/tv-actor-sravani-suicide-case-sai-reddy-threatened-to-sravani-on-road-midnight-before-she-commit-suicide/
ట్రయాంగిల్ లవ్ స్టోరీనే శ్రావణి ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. మూడు రోజులుగా సాగుతున్న ఈ కేసు దర్యాప్తులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. మొదట దేవరాజ్ చుట్టూ కేస్ తిరిగితే.. ముచ్చటగా మూడో రోజు సాయి వైపు మళ్లింది. పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవరాజ్ ఈ కేసులో పోలీసులకు చాలా కీలకమైన సాక్ష్యాలు అందించాడు.