Ganesh Immersion : గణేష్ నిమజ్జనంలో ఉద్రిక్తత .. అనంతలో టెన్షన్…టెన్షన్
అనంతపురం జిల్లాలో గణేశ్ శోభాయాత్రలో రెండు వర్గాల మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది.

Ganesh Immersion
Ganesh Immersion : అనంతపురం జిల్లాలో గణేశ్ శోభాయాత్రలో రెండు వర్గాల మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది. కూడేరు మండలం, ఉదిరిపికొండ తండాలో వినాయక విగ్రహాల ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయి. నిమజ్జనానికి ముందు వెళ్లే విషయంలో ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరు వర్గాలు రాళ్ల, కర్రలతో దాడికి దిగాయి. ఈ దాడుల్లో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also : Ganesh Nimajjanam: హుస్సేన్ సాగర్ గణేశ్ నిమజ్జన అనుమతి పిటిషన్ కొట్టిపారేసిన హైకోర్టు