US : పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన ఇద్దరు వ్యక్తులను దాచిపెట్టినందుకు.. అమెరికాలో భారత సంతతి హోటల్ యజమానులు అరెస్టు

మాంటిగల్‌లోని సూపర్ 8, మౌంటెన్ ఇన్‌లను కలిగి ఉన్న భారత సంతతికి చెందిన దక్షబెన్ పటేల్, హర్షిల్ పటేల్‌లను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.

US : పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన ఇద్దరు వ్యక్తులను దాచిపెట్టినందుకు.. అమెరికాలో భారత సంతతి హోటల్ యజమానులు అరెస్టు

ARREST

Indian origin hotel owners arrest in US : పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన ఇద్దరు వ్యక్తులను దాచిపెట్టినందుకు అమెరికాలో భారత సంతతికి చెందిన ఇద్దరు హోటల్ యజమానులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టై పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి తమ భవనంలో దాక్కున్న ఇద్దరు వ్యక్తుల ఆచూకీ గురించి పోలీసులకు అబద్ధం చెప్పినందుకు టేనస్సీలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన హోటల్ యజమానులను అరెస్టు చేశారు.

మాంటిగల్‌లోని సూపర్ 8, మౌంటెన్ ఇన్‌లను కలిగి ఉన్న భారత సంతతికి చెందిన దక్షబెన్ పటేల్, హర్షిల్ పటేల్‌లను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. జూలై 18న జరిగిన విచారణలో వాంటెడ్ వ్యక్తుల ఆచూకీ గురించి హోటల్ యజమానులు పోలీసులకు అబద్ధం చెప్పారని మాంటిగల్ పోలీస్ శాఖ తెలిపింది.

BJP MLA : మైనర్ బాలికపై అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు

మాంటిగల్‌లో అధిక మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు అధికారులు హోటల్ వెనుక భాగంలో నిఘా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బాల్కనీలో ఇద్దరు వ్యక్తులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఫ్రాంక్లిన్ కౌంటీకి వెలుపల నేరపూరిత వారెంట్లు ఉన్న వ్యక్తులను అధికారులు గుర్తించారు.

హోటల్‌ భవనం మూలలో దాచడానికి గది ఉందని కనుగొన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన ఇద్దరు వ్యక్తులు అక్కడే నివసిస్తున్నారని నిర్ధారించారని పోలీసులు తెలిపారు. అయితే వాంటెడ్ అనుమానితుల ఆచూకీ గురించి ఇద్దరు హోటల్ యజమానులను చాలాసార్లు పోలీసులు అడిగారు.

Viral Video: 150 అడుగుల ఎత్తులో రోలర్ కోస్టర్‌లో తలకిందులుగా ఇరుక్కుపోయిన 32 మంది టూరిస్టులు

కానీ హోటల్‌లో వారు నివసిస్తున్న విషయాన్ని దాచిపెట్టి యజమానులు అధికారులకు అబద్ధం చెప్పినట్లు పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. నిందితుల ఆచూకీ తెలిసినా తెలియదని తప్పుగా చెప్పడంతో హోటల్ యజమానులు దక్షబెన్, హర్షిల్‌లను పోలీసులు అరెస్టు చేశారు.