Delhi Accident: ఢిల్లీలో మహీంద్రా థార్ బీభత్సం.. ఇద్దరు మృతి.. ఎనిమిది మందికి గాయాలు

ఢిల్లీలోని మలై మందిర్ ఏరియాలో బుధవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఒక థార్ వాహనం అదుపుతప్పి పక్కనున్న వాహనదారులు, వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

Delhi Accident: ఢిల్లీలో మహీంద్రా థార్ బీభత్సం.. ఇద్దరు మృతి.. ఎనిమిది మందికి గాయాలు

Updated On : March 9, 2023 / 11:43 AM IST

Delhi Accident: ఢిల్లీలో మహీంద్రా థార్ వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వాహనదారులపైకి థార్ దూసుకెళ్లడంతో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని మలై మందిర్ ఏరియాలో బుధవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఒక థార్ వాహనం అదుపుతప్పి పక్కనున్న వాహనదారులు, వ్యాపారులపైకి దూసుకెళ్లింది.

India-Pak: పాక్ రెచ్చగొడితే భారత్ సైనిక చర్యకు దిగుతుంది.. అమెరికా వర్గాల అంచనా

ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. థార్ తలకిందులై, చాలా వరకు ధ్వంసమైంది. ప్రమాదం ధాటికి నాలుగు బైకులు, వ్యాపారం కోసం వాడే రెండు బండ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఘటన జరిగిన సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల, అతివేగా కారణంగా వాహనం అదుపుతప్పి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని స్థానిక వసంత్ విహార్, ఆర్కే పురం, ఏక్తా విహార్, శివ క్యాంప్‌నకు చెందిన వాళ్లుగా గుర్తించారు.

గాయపడ్డవారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరణించిన వారిని మున్నా, సమీర్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఎయిమ్స్ ట్రామా కేర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.