Selfie Craze Tragedy : సెల్ఫీలు దిగుతూ గోదావరిలో పడి ఇద్దరు యువకులు మృతి

కొండయిగూడెం వద్ద గోదావరి నదిలో స్నానానికి నలుగురు యువకులు వెళ్ళారు. స్నానానికంటే ముందు యువకులు అక్కడ సెల్ఫీలు తీసుకుంటుండగా ముగ్గురు యువకులు నదిలో పడిపోయారు.

Selfie Craze Tragedy : సెల్ఫీలు దిగుతూ గోదావరిలో పడి ఇద్దరు యువకులు మృతి

Selfie Craze Tragedy

Updated On : December 26, 2021 / 9:14 PM IST

Selfie Craze Tragedy :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. కొండయిగూడెం వద్ద గోదావరి నదిలో స్నానానికి నలుగురు యువకులు వెళ్ళారు. స్నానానికంటే ముందు యువకులు అక్కడ సెల్ఫీలు తీసుకుంటుండగా ముగ్గురు యువకులు నదిలో పడిపోయారు. వెంటనే గమనించిన స్థానికులు ఒకరిని రక్షించగా మరో ఇద్దరు మునిగిపోయారు.

సమాచారం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టి ఒకరి మృతదేహాన్ని వెలికి తీయగా మరొకరి కోసం మత్స్యకారులతో కలిసి గాలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న  స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు పర్య వేక్షిస్తున్నారు.