Gang Rape : కూల్‌డ్రింక్‌ లో మత్తుమందు కలిపి మహిళపై సామూహిక లైంగిక దాడి

మీరట్ జిల్లాలోని రోహ్తాలో మహిళకు మత్తు మందు కలిపిన  డ్రింక్ ఇచ్చి ఆమెపై సామూహికి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.

Gang Rape : కూల్‌డ్రింక్‌ లో మత్తుమందు కలిపి మహిళపై సామూహిక లైంగిక దాడి

Gang Rape

Updated On : August 18, 2021 / 5:55 PM IST

Gang Rape : ఉత్తరప్రదేశ్ లో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మీరట్ జిల్లాలోని రోహ్తాలో మహిళకు మత్తు మందు కలిపిన  డ్రింక్ ఇచ్చి ఆమెపై సామూహికి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. జిల్లాలో కలకలం రేపిన ఈ కేసులో ఇద్దరు  నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోక నిందింతుడు పరారీలో ఉన్నాడు.

పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం నిందితుల్లో ఒకరైన అమర్‌పాల్…రాస్నా రోడ్ ప్రాంతంలో హోటల్ నడుపుతున్నాడు.  హోటల్ మొదటి అంతస్తులో అమర్‌పాల్  కుమారుడైన ఉజ్వల్ జిమ్ నడుపుతున్నాడు. గత శుక్రవారం ఆగస్టు13వ తేదీ సాయంత్రం ఉజ్వల్ అతని ఇద్దరు స్నేహితులు ఒక మహిళను హోటల్ కు తీసుకువచ్చారు.

అక్కడ వారు ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. అది తాగిన  అనంతరం మహిళ స్పృహ కోల్పోగానే ఆమెపై ముగ్గురూ కల్సి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  కొద్ది సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన మహిళ తన బంధువులలో ఒకరికి ఫోన్ చేసి తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని చెప్పింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బాధితురాలి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు పంపి, బాధితురాలిని  వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు  చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.