Bodybuilder suicide Case : ఎన్ని అవమానాలు పడ్డా.. నా భార్యను నా శవాన్ని కూడా తాకనివ్వొద్దు.. బాడీ బిల్డర్ పాయింట్ బ్లాంక్‌లో..
Bodybuilder suicide Case : ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్ జిల్లాలో ఓ డిగ్రీ కళాశాల క్లర్క్, జిమ్ నిర్వాహకుడు దేవదత్ శర్మ (52) ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక విషయాలను సేకరించారు.
Uttar Pradesh Bodybuilder suicide Case
Bodybuilder suicide Case : ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్ జిల్లాలో ఓ డిగ్రీ కళాశాల క్లర్క్, జిమ్ నిర్వాహకుడు దేవదత్ శర్మ (52) ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మరణానికి కొద్దిసేపటి ముందు తన మేనకోడలికి పంపిన వాట్సాప్ సందేశంలో కుటుంబ సమస్యలు, అవమానాల గురించి ప్రస్తావిస్తూ కొన్ని చివరి కోరికలను వెల్లడించడం చర్చనీయాంశమైంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read : Big Shock To BJP Party : మూడింట రెండు ఓడిపోయిన బీజేపీ.. అధికారంలో ఉండికూడా..! ఇది జెన్‌జీ ఎఫెక్టా?
పోలీసుల వివరాల ప్రకారం.. దేవదత్ శర్మ సహారన్‌పూర్‌లోని సరసావా ప్రాంతంలో నివసిస్తూ బాలాజీ గ్రూప్ ఆఫ్ కాలేజీలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. అలాగే గత 26ఏళ్లుగా తన ఇంటి వెనుక భాగంలో ‘రాక్ జిమ్’ను నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం కళాశాల విధులు, జిమ్ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన అనంతరం ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాల్పుల శబ్దం విన్న కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఆత్మహత్యకు ముందు తన 21 ఏళ్ల మేనకోడలు నేహా శర్మకు పంపిన వాట్సాప్ సందేశంలో తాను ఎదుర్కొంటున్న అవమానాలను ఇక భరించలేకపోతున్నానని పేర్కొన్నారు. అలాగే తన అంత్యక్రియలకు ఎక్కువ ఖర్చు చేయొద్దని, కొన్ని వ్యక్తిగత కోరికలను కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరారు. ఈ సందేశంలో.. ‘‘తాను ఈ అవమానాన్ని ఇక భరించలేను. పదేపదే ఇలా చనిపోవడం కంటే ఒక్కసారే చావడం మేలు. నేను పిరికివాడిని కాదు. కానీ, ఈ అవమానం నా ఆత్మను లోపలి నుంచి చంపేసింది. తన భార్య తన శరీరాన్ని తాకడానికి వీలులేదు. అంత్యక్రియలకు కట్టెలు ఉపయోగించొద్దు. ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించవద్దు. నా ఆత్మ స్వేచ్ఛగా సంచరించాలని నేను కోరుకుంటున్నాను’’ అంటూ రాశాడు. పోలీసులు ఆ సందేశాన్ని దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు.
దేవదత్ శర్మకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు చండీగఢ్‌లో ఫోరెన్సిక్ సైన్స్ చదువుతున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారిని పోలీసులు విచారిస్తున్నారు. ఘటనాస్థలంలో ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించింది. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
