Wife Killed Husband : మూడో పెళ్లికి సిద్ధమైన భర్త…హతమార్చిన భార్య

ఇద్దరు భార్యలు ఉండగా మూడో పెళ్లికి సిధ్ధమైన భర్తను (మతపెద్ద), భార్య హత్యచేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.

Wife Killed Husband : మూడో పెళ్లికి సిద్ధమైన భర్త…హతమార్చిన భార్య

Wife Killed Husband

Updated On : June 25, 2021 / 8:39 PM IST

Wife Killed Husband : ఇద్దరు భార్యలు ఉండగా మూడో పెళ్లికి సిధ్ధమైన భర్తను (మతపెద్ద), భార్య హత్యచేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది. ముజఫర్ నగర్ సమీపంలోని షికార్పూర్ గ్రామంలో నివసించే మత పెద్ద అహ్మద్(57)కు ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇటీవల మూడో పెళ్లి చేసుకోవటానికి ఉబలాట పడుతూ ఆ విషయాన్ని తన ఇద్దరు భార్యలకు చెప్పాడు. దీంతో ముగ్గురి మధ్య గతకొద్ది రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.

రోజులాగే గురువారం రాత్రి కూడా మూడో పెళ్లి విషయమై ఇంట్లో గొడవ జరిగింది. ఈ క్రమంలో అహ్మద్ మొదటి భార్య హజ్రాను  తీవ్రంగా కొట్టాడు. అనంతరం  ముగ్గురూ  నిద్రపోయారు. భర్త కొట్టిన విషయం మనసులో పెట్టుకున్న హజ్రా, అహ్మద్ నిద్రిస్తుండగా ఇంట్లో కూరగాయల కోసం ఉపయోగించే కత్తితో అహ్మద్ మర్మాంగాలను తీవ్రంగా గాయపరిచింది. ఆ కత్తిపోట్లకు తీవ్ర రక్తసావ్రమైన అహ్మద్ ప్రాణాలు విడిచాడు.

ఈరోజు ఉదయం బంధుమిత్రుల సాయంతో అహ్మద్ అంత్యక్రియలు నిర్వహించటానికి సిధ్దమయ్యింది హజ్రా.  రోజు వీరు గొడవ పడటం తెలిసిన …చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  భౌరన్ కలాన్ పోలీసు స్టేషన్ సిబ్బంది ఘటనా స్ధలానికి వచ్చి అంత్యక్రియలను అడ్డుకున్నారు.

పోలీసులు విచారణ చేపట్టటంతో హజ్రా నేరం ఒప్పుకుంది. ఇద్దరు భార్యల మధ్యే రోజూ గొడవలు జరుగుతూ ఉంటే, మూడో భార్యను తీసుకువస్తాననే సరికి కోపం పట్టలేక ఆవేశంలో హత్యచేశానని తెలిపింది.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.