భార్య ముందే భర్త హత్య.. ఇంటికి నిప్పు : గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్తత

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి హత్యను నిరసిస్తూ అతడి బంధువులు, గ్రామస్తులు.. మరో వ్యక్తి ఇంటిపై దాడి

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 05:45 AM IST
భార్య ముందే భర్త హత్య.. ఇంటికి నిప్పు : గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్తత

Updated On : January 7, 2020 / 5:45 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి హత్యను నిరసిస్తూ అతడి బంధువులు, గ్రామస్తులు.. మరో వ్యక్తి ఇంటిపై దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి హత్యను నిరసిస్తూ అతడి బంధువులు, గ్రామస్తులు.. మరో వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న(జనవరి 6,2020) సిరిపురం-గొలనుకొండ రహదారిలో వెంకట్‌ రెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.

బైక్‌పై భార్యతో కలిసి జనగామకు వెళ్తుండగా వెంకట్‌ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి హత్య చేశారు. భార్య ముందే చెప్పేశారు. భార్య భాగ్యకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

కాగా, గ్రామంలోని ఓ వ్యక్తి హత్య చేసి ఉంటాడనే అనుమానంతో వెంకట్ రెడ్డి బంధువులు, గ్రామస్తులు అతడి ఇంటిపై దాడి చేశారు. ఇంటికి నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులకు నచ్చ చెప్పారు. కేసు దర్యాఫ్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. వారిని శాంతింపజేశారు. శాంతి భద్రతలు అదుపు తప్పకుండా గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.

Also Read : నన్ను వెన్నుపోటు పొడిచారు : ఎమ్మెల్యే రోజా