విశాఖపట్నంలో మైనర్ బాలికపై అఘాయిత్యం.. పాత చట్టం ప్రకారమే చర్యలు.. ఎందుకో తెలుసా?

పీఎం పాలెం పోలీస్‌ స్టేష‌న్‌లో నమోదైన కేసులో పాత నేర న్యాయ చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని..

విశాఖపట్నంలో మైనర్ బాలికపై అఘాయిత్యం.. పాత చట్టం ప్రకారమే చర్యలు.. ఎందుకో తెలుసా?

visakhapatnam police nab accused and booked with old criminal law

Updated On : July 1, 2024 / 12:59 PM IST

Visakhapatnam police: కొత్త నేర న్యాయ చట్టం దేశంలో నేటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే విశాఖపట్నంలో ఓ రేప్ కేసులో పాత చట్టం ప్రకారం మాత్రమే చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ వివేకానంద వెల్లడించారు.

మధురవాడ మల్లయ్యపాలెంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పీఎం పాలెం పోలీస్‌ స్టేష‌న్‌లో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు.

Also Read: CRPC రూల్స్‌ ఇక మరింత కఠినం.. అప్‌డేట్ అయిన ఐపీసీ సెక్షన్స్‌.. వివరాలు ఇవిగో

ఇవాల్టి నుంచి నమోదయ్యే కేసుల్లో కొత్త నేర న్యాయ చట్టం ప్రకారం శిక్షలు పడతాయని ఏసీపీ వివేకానంద తెలిపారు. పీఎం పాలెం పోలీస్‌ స్టేష‌న్‌లో నమోదైన కేసు ఘటన నిన్న జరిగింది కావున పాత చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. దర్యాప్తు తొందరగా పూర్తిచేసి నిందితుడికి 20 సంవత్సరాలు పైనే జైలుశిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే అత్యాచార కేసుల్లో అనేక మందికి శిక్షలు పడేలా చేశామని, మహిళలకు నిత్యం అండగా ఉంటామని భరోసాయిచ్చారు.

Also Read: ‘ఆమె నా పిల్ల రా’ అంటూ అమ్మాయి కోసం బాలుర మధ్య ఘర్షణ.. ఒకరి మృతి