రెండేళ్ల తర్వాత : ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
వరంగల్ జిల్లా హన్మకొండలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యకి పాల్పడిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఈ తీర్పు ఇచ్చారు.

వరంగల్ జిల్లా హన్మకొండలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యకి పాల్పడిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఈ తీర్పు ఇచ్చారు.
వరంగల్ జిల్లా హన్మకొండలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యకి పాల్పడిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఈ తీర్పు ఇచ్చారు. 2017 డిసెంబర్ లో శివ(24) అనే వ్యక్తి ఓ చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత దారుణంగా చంపేశాడు. 2019 జులై 1న కేసు విచారణ ప్రారంభమైంది. 12న వాదనలు ముగిశాయి. నేరం రుజువు కావడంతో జిల్లా కోర్టు శిక్ష ఖరారు చేసింది. రెండేళ్ల పాటు కేసు విచారణ నడిచింది. శుక్రవారం(సెప్టెంబర్ 20,209) కోర్టు తుది తీర్పు ఇచ్చింది. అత్యాచారం జరిపినందుకు పదేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ. 11 వేల జరిమానా.. సెక్షన్ 6 ఫోక్సో నేరానికి జీవితఖైదు, రూ. 2వేల ఫైన్ విధించారు. ఈ శిక్షలన్నింటినీ ఏకకాలంలో అనుభవించాలని జడ్జి తన తీర్పులో తెలిపారు. కోర్టు తీర్పు పట్ల బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా, మహిళా సంఘాలు తీర్పుని ఆహ్వానించాయి. అయితే ఆ కామాంధుడికి ఈ శిక్ష సరిపోదని ఉరి తియ్యాలని కొందరు డిమాండ్ చేశారు.
2017 డిసెంబర్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామంలో ఆరేళ్ల చిన్నారిని కటకం శివ కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత భయంతో బాలికను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రెండేళ్లు కేసు నడిచింది. చివరికి ఆ మానవ మృగానికి శిక్ష పడింది. ఆగస్టులో హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో కూడా వరంగల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. చిన్నారిని పొట్టనపెట్టుకున్న కామాంధుడు ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధిస్తూ… జిల్లా కోర్టు మొదటి అదనపు జడ్జి జయకుమార్ చారిత్రక తీర్పు ఇచ్చారు. నేరం జరిగిన 48 రోజుల్లోనే దోషికి ఉరిశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.
కఠిన చట్టాలు తీసుకొస్తున్నా, శిక్షలు అమలు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదని మహిళా సంఘాలు వాపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఆడపిల్లలు, మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయని వాపోయారు. నేరం చేసిన వాడిని వెంటనే కఠినంగా శిక్షిస్తే.. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు.