శ్వాసనాళాలు కాలిపోయాయి : రవళి హెల్త్ కండీషన్

రవళి కొలుకుని ఆరోగ్యంగా ఇంటికి వస్తుందని అనుకున్న కుటుంబసభ్యులకు వైద్యులు చేసిన ప్రకటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. శ్వాసనాళాలు కాలిపోవడంతో వెంటిలెటర్‌పై ఉంచి కృతిమ శ్వాసను అందిస్తున్నారు వైద్యులు.
Read Also : చంద్రబాబు లొల్లిరాజకీయాలు మానుకోవాలి : జీవీఎల్
ముఖం కూడా కాలిపోవడంతో చూపు కూడా కోల్పోయిందని, ఆమె కోలుకోవడం కష్టమేనని వైద్యులు వెల్లడిస్తున్నారు. వైద్యుల చేసిన ప్రకటనతో రవళి ఫ్యామిలీ ఆవేదనలో మునిగిపోయారు. వరంగల్ జిల్లాలో తనను ప్రేమించలేదని ఒకే ఒక కారణంతో 4 రోజుల క్రితం రవళిపై సాయి అన్వేష్ అనే దుర్మార్గుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. తీవ్రంగా కాలిపోయిన రవళిని వరంగల్ జిల్లా నుండి హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాగ్దవి డిగ్రీ కళాశాలలో చదువుతోంది.
Read Also : ఎలానో తెలుసుకోండి : డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చాలా ఈజీ
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి మెరుగైన వైద్య చికిత్స అందించాలని, ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తుందని ప్రకటించారు. యశోదా వైద్యులు చేసిన చికిత్స సత్ఫలితాలు ఇవ్వడం లేదు.
Read Also : టీడీపీలో టిక్కెట్ రాకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా!