Warangal: చారిత్రక నగరంలో.. మత్తు కథా చిత్రమ్!
వరంగల్ లో డ్రగ్స్ కేసుపై.. తీగ లాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే ఈ కేసు చారిత్రక నగరాన్ని కుదిపేస్తుండగా.. మరో షాకింగ్ న్యూస్ సంచలనం సృష్టిస్తోంది.

Wg
Warangal: వరంగల్ లో డ్రగ్స్ కేసుపై.. తీగ లాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే ఈ కేసు చారిత్రక నగరాన్ని కుదిపేస్తుండగా.. మరో షాకింగ్ న్యూస్ సంచలనం సృష్టిస్తోంది. కొన్ని రోజులుగా.. నగరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు సిటీ నడిబొడ్డులో ఉన్న ఓ హోటల్ లో మకాం వేసి జల్సాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ హోటల్ ఓ రాజకీయ నేతకు చెందినదిగా తెలుస్తోంది.
ఇటీవల కొన్ని రోజులుగా ఆ హోటల్ లో మకాం వేసిన విద్యార్థులు జల్సాలు చేసిన తీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అమ్మాయిలతో మత్తులో జోగుతూ.. విద్యార్థులు పార్టీలు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వాట్సాప్ చాటింగ్ లు, సోషల్ మీడియాలో ప్లానింగులతో.. వీకెండ్ కోసం ప్లాన్ చేసి మరీ పార్టీలు చేస్తున్నట్టుగా దర్యాప్తులో తేలినట్టు సమాచారం.
డ్రగ్ అడిక్టర్లలో ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఉన్నారని.. డ్రగ్ విక్రేతల్లో కూడా ఉన్నత కుటుంబాలకు చెందిన వారు ఉన్నారని తెలుస్తోంది. ఈ కేసులో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఉన్నట్టుగా టాక్. అంతే కాదు.. నగరంలోని సంపన్న కుటుంబాలకు చెందిన యువతను లక్ష్యంగా చేసుకుని.. ఐదేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా మాదక ద్రవ్యాలను వరంగల్ లో విక్రయాలు చేస్తున్నట్టుగా సమాచారం.
ఈ విషయంపై.. పోలీసుల దర్యాప్తులో జోరు పెంచారు. గోవా నుంచి నగరానికి సరుకు వస్తోందని తేల్చారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు. పూర్తి స్థాయి దర్యాప్తుతో వాస్తవాలు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
Read More:
Drugs : వరంగల్‌లో డ్రగ్స్ దందా.. ఇద్దరు యువకుల అరెస్టు