మహా ముదుర్లు.. అక్షరం ముక్క రాకపోయినా యూట్యూబ్‌లో చూసి దొంగతనాలు.. 500కిపైగా కార్లు చోరీ

యూట్యూబ్ లో చూసి టెక్నాలజీని వాడుకుని కార్లు చోరీ చేయడం పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది.

మహా ముదుర్లు.. అక్షరం ముక్క రాకపోయినా యూట్యూబ్‌లో చూసి దొంగతనాలు.. 500కిపైగా కార్లు చోరీ

Watching Youtube Videos Stole Over 500 Cars

Car Stole : పెద్దగా చదువుకోలేదు. అక్షరం ముక్క రాదు. అయితేనేమీ దొంగతనాల్లో ఆరితేరిపోయారు. కార్లు చోరీ చేయడంలో సిద్ధహస్తులు. కన్ను పడిందంటే ఖతమే. ఆ కారుని కొట్టుకుపోతారు. ఇలా వంద కాదు రెండు వందలు కాదు.. ఏకంగా 500కి పైగా కార్లు చోరీ చేశారు. చివరికి పోలీసులకు చిక్కారు. ఆ దొంగల తెలివితేటలకు పోలీసులే షాక్ అవుతున్నారు. పెద్దగా చదువుకోకపోయినా.. కార్లను చోరీ చేయడంలో వారి టాలెంట్ ను చూసి పోలీసులే విస్తుపోతున్నారు.

ఉత్తరప్రదేశ్ పోలీసులు కార్ల గజ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. వారిలో కీలకమైన వ్యక్తి తాజ్ మహ్మద్. 5వ తరగతి వరకే చదువుకున్నాడు. ఓ ముఠాగా ఏర్పడి కార్ల చోరీలు చేస్తున్నాడు. ఇలా 500కి పైగా కార్లను దొంగతనం చేశాడు.

తాజ్ మహమ్మద్ పెద్ద పెద్ద చదువులు ఏమీ చదవలేదు. జస్ట్ 5వ తరగతి వరకే చదువుకున్నాడు. అయితేనేమీ.. యూట్యూబ్ లో చూసి కార్ల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. యూట్యూబ్ లో మెలకువలను నేర్చుకున్న అతడు కార్లను అన్ లాక్ చేయడానికి హైటెక్ సాఫ్ట్ వేర్ ని ఉపయోగించాడు. అలా తన గ్యాంగ్ తో కలిసి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కార్లు చోరీ చేయడం ప్రారంభించాడు.

కాగా, కార్ల చోరీ కేసులో ఈ గ్యాంగ్ పలుమార్లు జైలుకి వెళ్లింది. అయినా వారి బుద్ధి మాత్రం మారలేదు. కార్ల చోరీలు ఆపలేదు. తాజాగా ఈ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ ముఠాకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడించారు. యూట్యూబ్ లో చూసి టెక్నాలజీని వాడుకుని కార్లు చోరీ చేయడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ దొంగల తెలివితేటలకు పోలీసులే అవాక్కవుతున్నారు.

ఈ గ్యాంగ్ లో కీలకమైన వ్యక్తి తాజ్ మహమ్మద్. 5వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆటో రిక్షా నడిపేవాడు. 2012లో రునాక్ తో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి కార్ల దొంగతనాలు ప్రారంభించారు. ఖరీదైన, లగ్జరీ కార్లను చోరీ చేశారు. వీళ్లకి చదవు రాదు. అయితేనేమీ యూట్యూబ్ లో చూసి కార్లు ఎలా చోరీ చేయాలో నేర్చుకున్నారని పోలీసులు తెలిపారు.

తాజ్ మహమ్మద్, రునాక్.. రింకూ, హకీంలతో కలిశారు. వీరంతా ముఠాగా ఏర్పడి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కార్లు చోరీ చేస్తున్నారు. కార్లు అన్ లాక్ చేసేందు ఈ గ్యాంగ్ హైటెక్ సాఫ్ట్ వేర్ ఉపయోగించేది. కారులో యాంటీ టెఫ్ట్ సిస్టమ్ ఉన్నా సరే.. ఎంతో ఈజీగా కారుని చోరీ చేసేయడంలో ఈ గ్యాంగ్ సిద్ధహస్తులు. ఖరీదైన, లగ్జరీ కారు కంటపడిందంటే చాలు.. ఖతమే. ఆ కారు చోరీ చేసేస్తారు. ముందుగా వీళ్లు రెక్కీ చేస్తారు. టార్గెట్ చేసుకున్న కారు దగ్గరికి వెళ్లి దాని అద్దాలు పగలగొట్టి లోనికి వెళ్తారు. వారి దగ్గరున్న ట్యాబ్లెట్ లో ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ సాయంతో డూప్లికేట్ తాళం తయారు చేస్తారు. కారు స్టీరింగ్ లాక్ ను పగలగొట్టేందుకు వాళ్లు మ్యాగ్నట్స్ వాడతారు. ఆ తర్వాత నెంబర్ ప్లేట్ మార్చేస్తారు. అలాగే కారులో ఉన్న జీపీఎస్ ట్రాకర్ తీసేస్తారు.

కారు చోరీ చేసేమయంలో తాము పట్టుబడకుండా ఈ ముఠా సభ్యులు చాలా జాగ్రత్తలే తీసుకుంటారు. తమ ఫోన్లను ఫ్లైట్ మోడ్ లో పెడతారు. అలాగే లొకేషన్ ను డిసేబుల్ చేస్తారు. ఆ విధంగా తమను పోలీసులు ట్రాక్ చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాదు.. మాట్లాడుకోవడానికి.. నార్మల్ కాల్స్ చేసుకోరు. కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే చేసుకుంటారు. చోరీ చేసిన కార్లు అమ్మేయగా వచ్చిన డబ్బుని అందరూ సమంగా పంచుకుంటారు. ఆ డబ్బుతో జల్సాలు చేస్తారు. లగ్జరీ లైఫ్ ని గడిపేందుకు తాము ఇలా కార్లు చోరీ చేస్తున్నామని వారు తెలిపారు. కాగా, ఈ గ్యాంగ్ ఎక్కువగా లగ్జరీ కార్లను చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఈ ముఠా సభ్యుల నుంచి పోలీసులు Maruti Vitara Brezza( రెండు కార్లు), Boleno (1), Honda Jazz, Hyundai Santro కార్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కార్ల చోరీకి వాడే స్క్రూ డ్రైవర్లు, సుత్తులు, ట్యాబ్ లు, ప్లయర్లు సీజ్ చేశారు. కార్లు చోరీ చేయడమే కాదు.. ఈ గ్యాంగ్ సభ్యులు ఏటీఎం నుంచి డబ్బు కూడా కొట్టేస్తున్నారు. ఢిల్లీ రోహిణి ప్రాంతంలో ఏటీఎంను కట్ చేసి 19లక్షలు దోచుకెళ్లారు.

టెక్నాలజీని మంచి పనులకు వాడితే తప్పు లేదు. కానీ, యూట్యూబ్ లో వీడియోలను చూసి ఆ టెక్నాలజీ ఇలా చెడ్డ పనులకు వినియోగించడం ఆందోళన కలిగించే అంశం అంటున్నారు పోలీసులు.

Also Read : ప్రేమను రిజెక్ట్ చేశాడని గురువుని టార్గెట్ చేసిన యువతి.. ఎంతటి దారుణానికి ఒడిగట్టిందంటే..