ప్రేమను రిజెక్ట్ చేశాడని గురువుని టార్గెట్ చేసిన యువతి.. ఎంతటి దారుణానికి ఒడిగట్టిందంటే..

ఆమె ప్రేమను నిరాకరించాడు. బుద్ధిగా చదువుకోవాలని మంచి మాటలు చెప్పి మందలించాడు. దీంతో ఆ యువతి కోపంతో రగిలిపోయింది.

ప్రేమను రిజెక్ట్ చేశాడని గురువుని టార్గెట్ చేసిన యువతి.. ఎంతటి దారుణానికి ఒడిగట్టిందంటే..

Woman Harass Teacher

Woman Harass Teacher : విద్య నేర్పే గురువును దైవంతో సమానంగా చూస్తాం. తల్లిదండ్రుల తర్వాత అంతటి గౌరవం గురువుకే దక్కుతుంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా చూసేది గురువే. అందుకే గురువుకి అంత గౌరవం. బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో కొందరు దారి తప్పుతున్నారు. ప్రేమ పేరుతో నీచానికి ఒడిగడుతున్నారు. తాజాగా ఓ యువతి రెచ్చిపోయింది. తన ప్రేమను రిజెక్ట్ చేశాడనే కోపంతో ఏకంగా విద్య నేర్పిన గురువుని, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది. ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు గురి చేసింది.

ఓ యువతి తన ప్రేమను రిజెక్ట్ చేశాడని విద్య నేర్పిన గురువు కుటుంబాన్ని టార్గెట్ చేసింది. బిచ్చగాడి పేరుతో సిమ్ కార్డ్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత గురువు కుటుంబం సభ్యుల ఫోటోలు సేకరించి మార్ఫింగ్ చేసింది. ఆ అసభ్యకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందా యువతి. దీంతో బాధితుడు బిత్తరపోయాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఆ పోస్టులు పెట్టిన యువతి గుర్తించారు. ఆమెను అనంతపురంలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

అనంతపురంకు చెందిన యువతి గ్రూప్‌-1 కోచింగ్‌ కోసం హైదరాబాద్‌ కు వెళ్లింది. అక్కడ అశోక్‌నగర్‌లోని ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేరింది. కాగా, అందులో ఒక ఫ్యాకల్టీకి ప్రేమిస్తున్నానంటూ తన మనసులో మాట చెప్పింది యువతి. అయితే, తనకు పెళ్లి అయ్యిందని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆ వ్యక్తి చెప్పాడు. ఆమె ప్రేమను నిరాకరించాడు. బుద్ధిగా చదువుకోవాలని మంచి మాటలు చెప్పి మందలించాడు. దీంతో ఆ యువతి రగిలిపోయింది. నా ప్రేమనే కాదంటావా? అని అతడిపై పగ పట్టింది. గురువును వేధించాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి కుటుంబం ఫోటోలు సేకరించి మార్ఫింగ్ చేసి అసభ్యకర ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది. చివరికి ఆమె పాపం పండి దొరికిపోయింది. కటకటాలపాలైంది.

Also Read : కొరియర్ పేరుతో ఘరానా మోసం.. 2కోట్లు పోగొట్టుకున్న ఐటీ కంపెనీ సీఈవో