శిఖా, జయరాం ఇంటికి ఎందుకు వెళ్ళింది: జయరాం కేసు

  • Published By: chvmurthy ,Published On : February 2, 2019 / 10:14 AM IST
శిఖా, జయరాం ఇంటికి ఎందుకు వెళ్ళింది: జయరాం కేసు

Updated On : February 2, 2019 / 10:14 AM IST

హైదరాబాద్ : ఎక్స్ ప్రెస్ టీవీ ఛైర్మన్ హత్య కేసులో కొత్త కొత్త  కోణాలు బయటకువస్తున్నాయి. జయరామ్ హత్య తర్వాత ఆయన మేనకోడలు శిఖాచౌదరి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు జూబ్లీహిల్స్ లోని జయరాం నివాసంకు వచ్చంది.  ఇంటికి తాళం వేసి వుండటంతో, వాచ్ మెన్  వద్దకు వెళ్లి తాళం ఇవ్వమని అడిగింది. వాచ్ మెన్ తాళం ఇవ్వక పోవటంతో అతడ్ని బెదిరించి తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్లింది. 

ఈలోపు వాచ్ మెన్ కు పోలీసులనుండి ఫోన్ రావటంతో వాచ్ మెన్ ఫోను మాట్లాడి జయరాం నివాసంలోకి వెళ్లగా , అక్కడ శిఖా చౌదరి ఆఫీస్ రూమ్ లో డాక్యుమెంట్లు సెర్చ్ చేస్తూ కనపడింది. అంతకుముందే పోలీసులతో మాట్లాడిన వాచ్ మెన్ శిఖాను బయటకు వెళ్లాలని గట్టిగా చెప్పటంతో ఆమె వెంటనే వెళ్ళి పోయినట్లు వాచ్ మెన్ తెలిపాడు. శిఖా, జయరాం ఇంటికి ఎందుకు వెళ్లిందనేది ఇప్పుడు  పలు  అనుమానాలకు తావిస్తోంది.