ఏసీ లేకుండా పడుకోవాలన్న భర్త, ఆత్మహత్య చేసుకున్న భార్య

ఓ చిన్న విషయం భార్య, భర్తల మధ్య పెద్ద వివాదానికి దారితీసింది. ఓ చిన్న అంశం ఆమెని హర్ట్ చేసింది. ఆమె

  • Published By: naveen ,Published On : May 19, 2020 / 11:55 AM IST
ఏసీ లేకుండా పడుకోవాలన్న భర్త, ఆత్మహత్య చేసుకున్న భార్య

Updated On : May 19, 2020 / 11:55 AM IST

ఓ చిన్న విషయం భార్య, భర్తల మధ్య పెద్ద వివాదానికి దారితీసింది. ఓ చిన్న అంశం ఆమెని హర్ట్ చేసింది. ఆమె

ఓ చిన్న విషయం భార్య, భర్తల మధ్య పెద్ద వివాదానికి దారితీసింది. ఓ చిన్న అంశం ఆమెని హర్ట్ చేసింది. ఆమె ఎంతగా హర్ట్ అయిందంటే ఏకంగా ఆత్మహత్య చేసుకుంది. ఏసీ రూమ్ లో పడుకునే విషయంలో భార్య, భర్తల మధ్య జరిగిన గొడవ భార్య ఆత్మహత్యకు దారితీసింది.

ఏసీ విషయంలో గొడవ:
ఏసీ రూమ్‌లో పడుకోవద్దన్నందుకు భర్తతో గొడవపడిన భార్య ఫ్యాన్‌కి ఉరేసుకుని చనిపోయిన సంఘటన గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లో జరిగింది. జయేష్ చౌహాన్, డింపుల్ చౌహాన్ దంపతులు నికోల్ ఏరియా సింగర్వ రోడ్‌లో నివాసం ఉంటున్నారు. వారికి నాలుగేళ్ల కిందట వివాహమైంది. వారికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. కుమారుడికి తల్లి దగ్గరే పడుకునే అలవాటు ఉంది. బాబు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఏసీ గదిలో పడుకోవద్దని భార్యకి చెప్పాడు భర్త.

ఏసీ లేని గదిలో పడుకోవాలన్న భర్త:
అయితే అందుకు భార్య డింపులు ఒప్పుకోలేదు. ఈ విషయం గురించి భర్తతో గొడవపడింది. కింది అంతస్తులో ఏసీ లేని గదిలో తాను పడుకోనని తెగేసి చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. అప్పటికి అక్కడి నుంచి వెళ్లిపోయిన డింపుల్ తన పనులు ముగించుకుని కొడుకుని తీసుకుని పైకి వెళ్లింది. చీరతో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరేసుకుని చనిపోయింది. 

ఫ్యాన్ కి ఉరేసుకున్న భార్య:
కాసేపటికి పిల్లాడి ఏడుపు విన్న జయేష్ రెండో అంతస్తుకి వెళ్లి చూశాడు. లోపల నుంచి తలుపు గడియ పెట్టి ఉండడంతో బలవంతంగా డోర్ ఓపెన్ చేశాడు. అప్పటికే డింపుల్ సీలింగ్ ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందకి దించి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకి ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్నారు. భర్త చెప్పిన వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అసలు వాస్తవాలు తెలియాల్సి ఉంది.

ఎవరో ఒకరు సర్దుకుపోవాలి:
కాగా చిన్న విషయానికి ఆమె ఆత్మహత్య చేసుకోవడం భర్తనే కాదు స్థానికులనూ షాక్ కి గురి చేసింది. భార్య, భర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావడం కామన్. ఎవరో ఒకరు సర్దుకుపోయినా లేదా రాజీ పడినా ఎలాంటి సమస్యా ఉండదు. ఆవేశం అనర్థానికి దారి తీస్తుందని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్య పరిష్కారమవుతుంది. ఇలాంటి అనర్థాలకు ఆస్కారం ఉండదు.

Read: కుటుంబంలో విషాదం నింపిన టిక్ టాక్.. తల్లి, కొడుకు సూసైడ్