Supari Murder : భర్తతో విసిగిపోయిన భార్య..సుపారీ ఇచ్చి హత్య

గంజాయికి  బానిసైన  భర్త ప్రతిరోజు రాత్రి పూట గంజాయి సేవించి ఆమత్తులో భార్యా, పిల్లల్ని కొట్టసాగాడు. అది భరించలేని భార్య తన గోడు సోదరుడికి  విన్నవించుకుంది. సుపారీ గ్యాంగ్ సహాయంతో బ

Supari Murder : భర్తతో విసిగిపోయిన భార్య..సుపారీ ఇచ్చి హత్య

Vsp Murder

Updated On : February 25, 2022 / 5:01 PM IST

Supari Murder : గంజాయికి  బానిసైన  భర్త ప్రతిరోజు రాత్రి పూట గంజాయి సేవించి ఆమత్తులో భార్యా, పిల్లల్ని కొట్టసాగాడు. అది భరించలేని భార్య తన గోడు సోదరుడికి  విన్నవించుకుంది. సుపారీ గ్యాంగ్ సహాయంతో బావను హతమార్చాడు బావమరిది.

వివరాల్లోకి   వెళితే   విశాఖ జిల్లా గంభీరం పంచాయతీ   కల్లివానిపాలెంలో  పిల్లి పైడిరెడ్డి అనే ఆటో డ్రైవర్ మంగళవారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి అతని భార్య, బావమరిదితో సహా ఆరుగురిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ హత్యకు భార్యే ప్రధాన సూత్రధారిగా గుర్తించారు.

ఆనందపురం సీఐ వై.రవి తెలిపిన వివరాల ప్రకారం… ఆటో నడుపుతూ జీవనం సాగించే పిల్లి పైడిరెడ్డి వ్యసనాలకు బానిసయ్యాడు. ఒకసారి గంజాయి కేసులో అరెస్టై    జైలు శిక్ష కూడా అనుభవించాడు.   కోవిడ్ సమయంలో జైలునుంచి బయటకు వచ్చిన తర్వాత గంజాయికి బానిసై భార్య అప్పల కొండమ్మను శారీరకంగా మానసికంగా చిత్రహింసలకు గురిచేసేవాడు. గంజాయి సేవించి అర్ధరాత్రి పూట ఇంటికివచ్చి ఆ మత్తులో భార్యా పిల్లలతో గొడవపడి వారిని కొట్టేవాడు.

ఈ బాధలు భరించలేని అప్పలకొండమ్మ  పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త పీడ  వదిలించాలని కోరింది.  దీంతో ఆమె సోదరుడు కొల్లి శ్రీనివాసరావు   బావ హత్యకు ప్లాన్ చేశాడు.  సుపారీ గ్యాంగ్ తో 4 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. 20 వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు.

వారం రోజులక్రితం ఒకసారి పైడిరెడ్డిని హత్యచేయటానికి సుపారీ గ్యాంగ్ ప్రయత్నించినా ఆ ప్లాన్ విఫలం అయ్యింది.  ఈ క్రమంలో సుపారీ గ్యాంగ్ మంగళవారం రాత్రి మళ్లీ  పైడిరెడ్డి‌ని   హత్య చేయటానికి స్కెచ్ వేసింది. అందులో భాగంగా పైడిరెడ్డి భార్య అప్పలకొండమ్మ తన  ఇంటికి వచ్చింది.  ఇంట్లో అత్త సూరమ్మ, అప్పలకొండమ్మ ఉన్నారు. వేరే గదిలో పైడిరెడ్డి నిద్రపోయాడు.

ప్లాన్ లో భాగంగా కొత్తపరదేశి పాలెం గ్రామానికి చెందిన పల్లా దుర్గారావు(20) ఇంటి బయట కత్తి పట్టుకొని కాపలా ఉండగా, ఆనందపురం మండలం, బోయిపాలెం గ్రామానికి చెందిన అప్పలకొండ సోదరుడు కొల్లి శ్రీనివాసరావు(23), కొత్త పరదేశి పాలెం గ్రామానికి చెందిన బోర ఆదిబాబు(27), భీమిలి మండలం కృష్ణా కాలనీకి చెందిన బంగారి గణేష్‌(30), వలస అప్పలరాజు(31) అర్ధరాత్రి సమయంలో ఇంటి వెనుక వైపు నుంచి లోపలికి వచ్చారు.
Also Read : Agri Gold Case : అగ్రి గోల్డ్ కేసులో ఏపీ హై కోర్టు కీలక నిర్ణయం

పైడిరెడ్డి తల్లి సూరమ్మను శ్రీనివాసరావు, ఆదిబాబు, అప్పలరాజు నొరు నొక్కి కదలకుండా బంధించారు. సోఫా   సెట్‌పై నిద్రపోతున్న పైడిరెడ్డి తలపై గణేష్‌ రాడ్డుతో కొట్టి, కత్తితో పీక కోసి హత్య చేశాడు.  అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సూరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు ముందు మృతుని భార్యను విచారించారు.

పోలీసు విచారణలో అప్పలకొండమ్మ అసలు విషయం బయటపెట్టింది. భర్త వేధింపులు భరించలేక తానే హత్య చేయించమని కొరినట్లు చెప్పి నేరం అంగీకరించింది.   అప్పల కొండమ్మ ఇచ్చిన సమాచారంతో మిగిలిని నిందితులు ఐదుగురిని గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద నుంచి స్టీలు రాడ్డు, కత్తి, రెండు మోటారు సైకిళ్లు, 6 ఫోన్లు, రూ.4 వేలు స్వాధీనం చేసుకున్నారు.