Nizamabad : రూ.2 లక్షల సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య
భర్త మద్యానికి బానిసై తనను హింసిస్తున్నాడని భార్య పీరుబాయి మనసులో పెట్టుకున్నారు. చందర్, మహేశ్ అనే ఇద్దరు వ్యక్తులతో భర్తను చంపేయాలని ప్లాన్ చేశారు.

Nizamabad
Nizamabad : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. మద్యానికి బానిసై హింసిస్తున్నాడని భర్తను భార్య హత్య చేయించారు. రూ.2 లక్షల సుపారీ ఇచ్చి భర్తను చంపించారు. గత నెల ఏప్రిల్ 30న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి దగ్గర నుంచి నాలుగు సెల్ ఫోన్స్, ఒక బైక్, పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు.
గోపాల్ మండలం కాస్వా తండాకు చెందిన పరావత్ గోపాల్(50), పీరుబాయి భార్యాభర్తలు. పరావత్ గోపాల్ గతంలో దుబాయ్ కి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గోపాల్ కు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. అయితే కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కూతురు హైదరాబాద్ లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
Extra Marital Affair : ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
భర్త మద్యానికి బానిసై తనను హింసిస్తున్నాడని భార్య పీరుబాయి మనసులో పెట్టుకున్నారు. చందర్, మహేశ్ అనే ఇద్దరు వ్యక్తులతో భర్తను చంపేయాలని ప్లాన్ చేశారు. తన మాటీలను కుదవబెట్టిన తీసుకొచ్చిన డబ్బులకు మరి కొన్ని డబ్బులు కలిపి మొత్తం రూ.2 లక్షలను వారికి సుపారీగా ఇచ్చి భర్తను హత్య చేయించారు.