వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి

  • Published By: murthy ,Published On : December 4, 2020 / 11:10 PM IST
వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి

Updated On : December 4, 2020 / 11:10 PM IST

woman accidentally falls into well and dies : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన తాత లక్ష్మి(55) అనే మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. గ్రామానికి చెందిన లక్ష్మి రోజువారీగా తమకున్న వ్యవసాయ పనుల నిమిత్తం గురువారం చేనులోకి వెళ్ళింది.

పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో బావి దగ్గర ఉన్న డ్రమ్ములో నీరు పట్టడానికి వెళ్ళింది. ఆతర్వాత ఆమె ఆచూకి లభించలేదు. కుటుంబీకులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం ఉదయం బావిలో శవమై కనిపించింది. తన తల్లి పట్ల ఎవరికి ఎటువంటి అనుమానం లేదని కాలు జారి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది ఉంటుందని మృతురాలి కుమారుడు సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరభద్రరావు వివరించారు.