మైనర్ చెల్లిని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్న అక్క

ఆమె అందరు ఆడవాళ్ళ లాగానే ఉంది. కానీ కొంత విచిత్ర మనస్తత్వం. సాధారణంగా ఆడవాళ్లకు మగవారిమీద, మగవాళ్లకు ఆడవారిమీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఆమెకు మగవాళ్లకంటే ఆడవాళ్లంటేనే ఎక్కువ పిచ్చి. అందంగా ఉన్న ఆడవాళ్ళను చూస్తే కామంతో రగిలిపోయేది. వరసకు చెల్లెలు అయ్యే బాలికతో డేటింగ్ చేసి ఆమెను లేపు కెళ్లి పెళ్లి చేసుకుంది. చట్టవిరుధ్దమైన పని చేసినందుకు పోలీసులు అరెస్టు చేసి జైలు కుపంపారు.
మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాకు చెందిన గుణ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతి లెస్బియన్ గా మారింది. అసహజ శృంగారం కోసం పరితపించేది. ఆడవాళ్లను చూస్తే కామంతో ఊగిపోయేది. తనకు వరుసకు చెల్లెలయ్యే బుధే బాలాజీ ప్రాంత్రంలోని 17 ఏళ్ల మైనర్ బాలికను మోహించింది. మాయమాటలు చెప్పి ఆమెను ఇంటికి తెచ్చుకుంది. ఆమెలో కూడా అలాంటి కోరికలే రెచ్చగొట్టింది.
ఇద్దరూ కల్సి ఏడాది పాటు కలిసి జీవించారు. అనంతరం ఇద్దరూ కల్సి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా చెల్లెలిని తీసుకెళ్లి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. తాను వరుడిలాగ బట్టలు వేసుకుని, తన మైనర్ చెల్లిని వధువులాగా అలంకరించి మెడలో తాళి కట్టింది. ఇద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు కనుక 2,3 రోజుల్లో తిరిగి వస్తారులే అనుకుని.. కొద్దిరోజులు ఎదురు చూశారుమైనర్ బాలిక తల్లితండ్రులు.
నెల రోజులైనారాకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతుల కోసం గాలింపు చేపట్టారు. ఒక గ్రామంలో వీరిద్దరూ ఉన్నసంగతి తెలుసుకుని వారిద్దరినీ అరెస్టు చేసి తీసుకువచ్చారు. అప్పటికే వారిద్దరూ పెళ్ళి చేసుకున్నారని తెలిసి కుటుంబ సభ్యులు, పోలీసులు షాకయ్యారు. భారతీయ చట్టాల ప్రకారం ఒకే లింగం వారు పెళ్లి చేసుకోవటం విరుధ్ధం కనుక మైనర్ బాలికను లేపుకు పోయి పెళ్లి చేసుకున్నందుకు అక్క పైన పోక్సో చట్టంకింద కేసునమోదు చేసి జైలుకు పంపటంతో ఇద్దరి బంధం తెగిపోయింది.
Read This : కర్నూలులో అమానుషం, గర్భిణి మృతదేహాన్ని అడవుల్లో చెట్టుకి కట్టేశారు