Bihar Police : హోటల్ గదిలో మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

కేసు విచారణ నిమిత్తం వేరే రాష్ట్రం వెళ్లిన మహిళా పోలీసు కానిస్టేబుల్ అనుమానాస్పదంగా మరణించిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

Bihar Police : హోటల్ గదిలో మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

woman constable

Updated On : August 12, 2022 / 5:38 PM IST

Bihar Police : కేసు విచారణ నిమిత్తం వేరే రాష్ట్రం వెళ్లిన మహిళా పోలీసు కానిస్టేబుల్ అనుమానాస్పదంగా మరణించిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.  బీహార్‌ ముజఫర్‌పూర్ జిల్లాలోని బ్రహ్మపుత్ర పోలీస్ స్టేషన్‌లో   కవితా కుమారి(25) మహిళా కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. 2021 లో నమోదైన చీటింగ్ కేసు  విచారణ నిమిత్తం మరికొంత మంది పోలీసు సిబ్బందితో కలిసి ఆమె మహారాష్ట్రలోని పూణేకు వెళ్లారు.

అక్కడ ఆమె బావథాన్ లోని చాందినీ చౌక్ ప్రాంతంలోని ఒక హోటల్ లో బస చేసింది. గురువారం మధ్యాహ్నం 1-30 గంటల సమయంలో ఆమె హోటల్ గదిలో అనుమానాస్పదంగా మృతి చెంది ఉండగా గుర్తించారు.  సమాచారం తెలుసుకున్న పూణే లోని హింజేవాడి పోలీసుస్టేషన్ అధికారులు ఘటనా స్ధలానికి వచ్చి పరిశీలించారు.

ప్రాధమిక ఆధారాలను బట్టి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా పోలీసులతో కలిసి పూణే పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి  తరలించారు.

Also Read : Hyderabad Drugs : హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత-నైజీరియన్ అరెస్ట్