Hanamkonda Petrol Attack : చిట్టీ డబ్బులు అడిగినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు
వరంగల్ లో ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. హన్మకొండలోనిన్న దారుణం చోటు చేసుకుంది.

Hanamakonda Petrol Attack
Hanamkonda Petrol Attack : వరంగల్ లో ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. హన్మకొండలోనిన్న దారుణం చోటు చేసుకుంది. చిట్టీ పాడుకుని ఎనిమిది నెలలైనా చిట్ ఫండ్ కంపెనీ డబ్బులు చెల్లించలేదు. చిట్‌ఫండ్ మోసాలను నిలదీసినందుకు వ్యక్తిపై పెట్రోల్ పోసిసజీవ దహనం చేసేందుకు యత్నింటారు ప్రైవేట్ చిట్‌ఫండ్స్ నిర్వాహకులు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని మాటలతో నమ్మించి చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేయడం పరిపాటైపోయింది.
చోటా మోట నాయకుల అండదండలతో లక్షల రూపాయాలు వసూలు చేసి ప్రశ్నించిన వారిని బెదిరించడం, దాడులు చేయడం చేస్తున్నారు. ఏదో ఒక అవసరం కోసం చిట్టీవేసి లిఫ్ట్ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా కస్టమర్లను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హన్మకొండలోని టైలర్ స్ట్రీట్‌లో రాజు అనే వ్యక్తి సెల్ ఫోన్ షాప్ నిర్వహిస్తున్నాడు. అచల చిట్‌ఫండ్‌లో చిట్టివేసి మూడు నెలల క్రితం లిఫ్ట్ చేశాడు. అప్పటి నుంచి కంపెనీ చిట్టీ డబ్బులు ఇవ్వకుండా రేపు, మాపంటూ కాలం వెళ్లదీస్తోంది.
దీంతో విసుగు చెందిన రాజు డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ చిట్స్ కార్యాలయం వద్ద ఏజెంట్‌ని గట్టిగా నిలదీశాడు. ప్రతీకారంగా ఇద్దరు దుండగులు శుక్రవారం మధ్యాహ్నం రాజు షాపు వద్దకు వచ్చి అక్కడ ఉన్న రాజు అతని భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్తానికులు అప్రమత్తమై అతడి అంటుకున్న మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎదురుగా ఉన్న పాన్ షాపు యజమాని రంగయ్య కూడా మంటలు అంటుకుని గాయాలపాలయ్యాడు. మొత్తానికి స్ధానికులు ఇద్దరికీ మంటలు ఆర్పారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు . ప్రస్తుతం రాజు చావుబతుకుల మద్య కోట్టుమిట్టాడుతున్నాడు.ఈ ఘటనలో రాజు సెల్ ఫోన్ షాపు కూడా పాక్షింకంగా కాలిపోయింది.
కాగా…తమకు రావాల్సిన డబ్బులు అడిగినందుకే తమను చంపాలని చూశారని ఆరోపించారు వరంగల్ లో పెట్రోల్ దాడి ఘటన బాధితుడు రాజు భార్య మానస ఆరోపించింది.. 8 నెలలుగా చిట్టి డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని.. పథకం ప్రకారమే మొదట చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశారన్నారు.. డబ్బులు అడిగితే చంపుతామని కూడా బెదిరించారని తెలిపారు మానస.
డబ్బులు అడిగినందుకే హత్యకు కుట్ర చేసారని… పధకం ప్రకారమే ముందుగా చెల్లని చెక్కులు ఇచ్చారని ఆమె తెలిపారు. డబ్బులు అడిగితే చంపుతామని బెదిరించారని, మా కుటుంబానికి అచలా చిట్స్ యాజామాన్యంతో ప్రాణ హాని ఉందని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆమె అన్నారు.
కాగా …అచల చిట్‌ఫండ్ ఆగడాల వెనుక జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రోద్బలం ఉన్నట్లుతెలుస్తోంది. ఆ ప్రజాప్రతినిధి అండతోనే అచల చిట్ ఫండ్ యాజమాన్యం ఖాతాదారులపై దాడులు చేస్తోందని స్ధానికులు చెపుతున్నారు. ఖాతాదారుల డబ్బులతో చిట్ ఫండ్ సంస్ధ రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడులు పెట్టిందని.. ఆరియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్రజాప్రతినిధి భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఖాతాదారులు డబ్బలు అడగకుండా ఉండేందుకు… భయభ్రాంతులకు గురిచేసేందుకే దాడి పథకం పన్నారని సమాచారం.