Woman Trafficking Gang: అమ్మకానికి అమ్మాయిలు..! కొమురం భీం జిల్లాలో మహిళల అక్రమ రవాణ గుట్టురట్టు.. ఒంటరి, పేద, భర్త చనిపోయిన మహిళలే టార్గెట్..
పరారీలో ఉన్న వారి కోసం స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్ కి పంపారు ఉన్నతాధికారులు.

Woman Trafficking Gang: కొమురం భీం జిల్లాలో మహిళల అక్రమ రవాణ గుట్టురట్టైంది. పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు ఉన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఏడాది క్రితం ఆసిఫాబాద్ మండలం వాడిగొందిలో యువతి మిస్సింగ్ కేసు దర్యాప్తుతో మహిళల అక్రమ రవాణ వ్యవహారం బయటపడింది. ఓ యువతిని రూ. లక్ష 20 వేలకు, మరో యువతిని రూ. లక్ష 10 వేలకు మధ్యప్రదేశ్ లో అమ్మేసింది ముఠా. రెండు నేరాలలో మొత్తం తొమ్మిది మంది నిందితులను గుర్తించారు పోలీసులు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. ముగ్గురు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్ కి పంపారు ఉన్నతాధికారులు.
నిందితుల్లో హరిదాసు అనే వ్యక్తిపై 2019లో తిర్యాని పీఎస్ లో కేసు నమోదైంది. ప్రధాన నిందితుడు హరిదాసు పోలీస్ కానిస్టేబుల్. 2022 నుండి విధులకు హాజరు కావడం లేదు. నిందితుల్లో రమేశ్ గౌడ్, సురేఖ, జగదీశ్ లది మధ్యప్రదేశ్ రాష్ట్రం. నిందితుల్లో విజయలక్ష్మి, సుజాత, పంచాపూల, ఉష, సురేఖ అనే ఐదుగురు మహిళలు ఉన్నారు. ఒంటరి మహిళలు, భర్త చనిపోయిన మహిళలు, పెళ్లి కాని పేదింటి యువతులే టార్గెట్ గా మహిళల విక్రయం జరుగుతోంది. తనను రెండుసార్లు అమ్మేసినట్టు ఓ యువతి వాపోయింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఇమ్మొరల్ ట్రాఫిక్ యాక్ట్ తో పాటు పలు సెకన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.