బస్సులో వేధిస్తున్నారంటూ మహిళ ట్వీట్.. ఆకతాయిల తిక్కకుదిర్చిన పోలీసులు!  

  • Published By: sreehari ,Published On : February 25, 2020 / 01:06 PM IST
బస్సులో వేధిస్తున్నారంటూ మహిళ ట్వీట్.. ఆకతాయిల తిక్కకుదిర్చిన పోలీసులు!  

Updated On : February 25, 2020 / 1:06 PM IST

మహిళలపై రోజురోజుకీ వేధింపులు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒక చోట ప్రతి మహిళ ఏదొక సందర్భంలో వేధింపులు ఎదుర్కొంటోంది. మానసికంగా కావొచ్చు.. శారీరకంగా కావొచ్చు.. బస్సులో, రైళ్లల్లో, మెట్రోలో ఆకతాయిల వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈవ్ టీజర్లు వెంటబడి వేధించడం లాంటి అనుభవాన్ని చాలామంది మహిళలు ఎదుర్కొంటూనే ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళ కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంది.

బస్సులో ప్రయాణిస్తుండగా తన సీటు పక్కనే కూర్చొన్న ఆకతాయిలు తన ఫోన్ నెంబర్ పదే పదే అడుగుతూ వేధించారు. బాధిత మహిళ భయంతో బస్సులోనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా యూపీ పోలీసులకు ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో తాను వెళ్లే బస్సులో ‘ఇది నా టికెట్.. బస్సు నెంబర్ అంటూ ఫొటో తీసి ట్వీట్‌కు యాడ్ చేసింది. తక్షణమే స్పందించిన యూపీ పోలీసులు బస్సు లొకేషన్ ఆధారంగా ఆకతాయిలను అరెస్ట్ చేశారు. 

యూపీలోని ఏదైనా 112 ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేయాల్సిందిగా కోరుతూ మహిళ ట్వీట్ కు పోలీసులు బదులిచ్చారు. 

ఆ తర్వాత తాను ప్రయాణించే బస్సు ఎక్కడ ఉందో కచ్చితమైన లొకేషన్ షేర్ చేయమని పోలీసులు మరో ట్వీట్ చేశారు.  

మహిళ లొకేషన్‌తో పాటు ఆయోధ్య పోలీసు, బరబంకి పోలీసు ట్విట్టర్ అకౌంట్లను కూడా యూపీ పోలీసులు ట్యాగ్ చేశారు. 

యూపీ పోలీసుల ట్వీట్లతో స్థానిక పోలీసులకు సమాచారం అందిన వెంటనే బస్సును గుర్తించి నిలిపివేశారు. విచారణ అనంతరం ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని తీసుకుని వ్యాన్ లో తీసుకెళ్లారు. ఆ తర్వాత మహిళ జరిగిన పరిస్థితి గురించి మరోసారి పోలీసులకు షేర్ చేసింది. యూపీ పోలీసులకు కృతజ్ఞతలు.. పోలీసుల నుంచి ఇప్పుడు నాకు సాయం లభించింది. ఇద్దరు యువకులను పోలీసులు తీసుకెళ్లారు.. ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నాను’ అంటూ ట్వీట్ చేసింది.