గుడిలో ఆత్మహత్య చేసుకుంటానని మహిళ హల్ చల్

  • Published By: chvmurthy ,Published On : December 16, 2019 / 01:16 PM IST
గుడిలో ఆత్మహత్య చేసుకుంటానని మహిళ హల్ చల్

Updated On : December 16, 2019 / 1:16 PM IST

ఆస్తి వివాదం కేసులో పోలీసులు తనకు న్యాయం చేయటంలేదని ఆరోపిస్తూ ఒక మహిళ  గుడిలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్ లోజరిగింది.  విజయనగర్ కాలనీ సమీపంలోని ప్రిన్స్ నగర్ కు చెందిన మహిళ పెట్రోల్ బాటిల్ తో స్ధానికంగా ఉన్న గుడిలోకి వెళ్లి తాళం వేసుకుని ఒంటిపై పెట్రోలు పోసుకుని సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది.

ఆస్తివివాదం కేసులో తనకు న్యాయం చేయకపోగా పోలీసులు తనపైనే కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మాటల్లో పెట్టి ఆమె ప్రయత్నాన్ని ఆపగలిగారు.

ముందుగా మఫ్టీలో ఉన్న ఒక పోలీసును ఆమె వద్దకు రాయబారానికి పంపారు. అతను ఆమెను మాటల్లో పెట్టి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది ఆమెపై అగ్ని నిరోధక ద్రావకాలు,    పౌడరు చల్లారు. దాదాపు 2 గంటలపాటు ఆమెతో చర్చలు జరిపి…ఆమెను ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడగలిగారు.