Social Media Love : సోషల్ మీడియా‌లో బాలికతో ప్రేమాయణం…తర్వాత…

తమిళనాడుకు చెందిన బాలిక ఇన్‌స్టాగ్రాం లో పరిచయం అయిన యువకుడితో పరిచయం పెంచుకుంది. మాయమాటలతో ఆ యువకుడు బాలిక వద్దనుంచి బంగారం,నగదు దోచుకున్నాడు.

Social Media Love : సోషల్ మీడియా‌లో బాలికతో ప్రేమాయణం…తర్వాత…

Social Media Love Cheating

Updated On : October 2, 2021 / 12:50 PM IST

Social Media Love : కరోనా లాక్‌డౌన్ సమయంలో విద్యార్ధులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించారు. అందుకోసం తల్లితండ్రులు పిల్లలకు స్మార్ట్ ఫోన్ల్ కొనిచ్చారు. చాలా మంది వాటిని సద్వినియోగం చేసుకున్నారు. కొంతమంది పిల్లలు క్లాసులు అయిపోయాక సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయ్యారు. అందులో భాగంగా తమిళనాడుకు చెందిన బాలిక ఇన్‌స్టాగ్రాం లో పరిచయం అయిన యువకుడితో పరిచయం పెంచుకుంది. మాయమాటలతో ఆ యువకుడు బాలిక వద్దనుంచి బంగారం,నగదు దోచుకున్నాడు.
Also Read : TV Actress Soujanya : యువనటి సౌజన్య ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
తిరువళ్ళూరు జిల్లాకు విష్ణువాక్కం గ్రామానికి చెందిన బాలిక(16) తిరువళ్లూరులోని ఒకప్రైవేట్ స్కూల్ లో చదువుతోంది. ఆన్ లైన్ క్లాసులకోస తండ్రి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. క్లాసులు అయిపోయిన తర్వాత బాలిక ఫోన్‌లో సోషల్ మీడియాకు అలవాటు పడింది. ఈక్రమంలో ఆమెకు ఇన్‌స్టాగ్రాం లో మనవాలనగర్ కు చెందిన రేవంత్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. మాయమాటలు చెపుతూ ప్రేమ పేరుతో బాలికను బుట్టలో వేసుకున్నాడు.

తన తల్లికి ఆరోగ్యం సరిగా లేదని.. చదవుకోటానికని చెప్పి బాలికవద్ద నుంచి వివిధ సందర్భాల్లో 32 సవర్ల బంగారు నగలు, రూ. లక్ష రూపాయల నగదు వసూలు చేసి ఫోన్ స్విఛ్చాప్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన బాలిక తండ్రి వెంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేవంత్ కోసం గాలిస్తున్నారు.