ఫేక్ అకౌంట్లతో అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్.. అడ్డంగా దొరికిపోయాడు!

వాట్సప్, ఇన్‌స్ట్రాగామ్ ఫేక్ అకౌంట్ల పేరుతో యువతుల న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాంపట్నానికి చెంది రఘుబాబు గుంటూరులో కొంతకాలం ఐటీ కంపెనీ నడిపాడు.
లాక్‌డౌన్ కారణంగా సొంత గ్రామానికి రెండు నెలల క్రితమే వెళ్లిపోయాడు. మొబైల్ ఫోన్ ద్వారా ఫేక్ యాప్ ద్వారా నెల వ్యాలిడిటీతో సిమ్ తీసుకున్నాడు. ఫేక్ వర్చువల్ నంబర్లు తీసుకుని నకిలీ వాట్సప్ క్రియేట్ చేశాడు. PIC AQT యాప్ ద్వారా యువతుల ఫొటోలను న్యూడ్ ఫొటోలతో మార్ఫింగ్ చేశాడు.
అసలైన నగ్నఫొటోలను తనకు పంపాలని బ్లాక్ మెయిలింగ్ చేశాడు. లేదంటే.. తన దగ్గర నగ్నఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అతడు చేస్తున్న ఫేక్ నంబర్‌ను కొంతమంది బ్లాక్ చేసేశారు. ఓ యువతి మాత్రం భయపడి చెప్పినట్లు చేసింది.
న్యుమెరో సిమ్ యాప్ ద్వారా మరో ఫేక్ నంబర్ క్రియేట్ చేసుకున్నాడు. ఫేక్ వాట్సప్, ఫేక్ ఇన్‌స్ట్రాగామ్ క్రియేట్ చేశాడు. యువతుల ఫొటోలను నగ్నఫొటోలుగా మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. బాధిత యువతి ఒకరు ధైర్యం చేసి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
తన మొబైల్ ఫోన్ ద్వారా ఓ ఫేక్ వైబ్‌సైట్ నుంచి రెండు ఫేక్ మెయిల్స్ క్రియేట్ చేశాడు. రెండు ఫేక్ ఇన్‌స్ట్రాగామ్‌లతో యువతిని బ్లాక్‌మెయిల్ చేశాడు. బాధిత యువతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఫేక్ అకౌంట్లను గుర్తించారు. ఫోన్ నంబర్, అడ్రస్ గుర్తించి నిందితుడిని పోలీసులు చివరికి అరెస్టు చేశారు.