బట్టతల బాధతో యువకుడు ఆత్మహత్య
హైదరాబాద్ కొండాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. బట్టతల సమస్య యువకుడి ప్రాణాలు తీసింది. జుట్టు రాలిపోయిందనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ కొండాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. బట్టతల సమస్య యువకుడి ప్రాణాలు తీసింది. జుట్టు రాలిపోయిందనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ కొండాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. బట్టతల సమస్య యువకుడి ప్రాణాలు తీసింది. జుట్టు రాలిపోయిందనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. అతడి వయసు 18 ఏళ్లు. ఇంటర్ పూర్తి చేశాడు. ప్రస్తుతం జేఈఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో అతని తల వెంట్రుకలు రాలిపోతున్నాయి. చిన్న వయసులోనే బటతల వచ్చిందని మనోవేదనకు గురయ్యాడు. ఆ బాధతో సోమవారం(జనవరి 06,2020) బాత్ రూమ్ లో ఉరేసుకుని చనిపోయాడు. బట్టతల రావడమే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్ రాశాడు.
మృతుడి తండ్రి మాదాపూర్ లో ఉద్యోగం చేస్తున్నారు. కొండాపూర్ లోని ఓ అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్నారు. మృతుడికి అన్న ఉన్నాడు. ఎంబీఏ చదువుతున్నాడు. మృతుడు సైనస్ తోనూ బాధపడుతున్నాడు. 6 నెలలుగా జట్టు రాలిపోవడం ఆరంభమైంది. క్రమంగా బట్టతలగా మారింది. చిన్నవయసులోనే బట్టతల వచ్చిందని తీవ్ర మనోవేదన చెందేవాడు. ఈ విషయాన్ని పలుమార్లు తల్లిదండ్రులకు సైతం చెప్పాడు.
సోమవారం ఉదయం బాత్ రూమ్ కి వెళ్లిన అతడు.. ఎంత సేపటికీ బయటకు రాలేదు. అనుమానం వచ్చిన తల్లి వెళ్లి చూడగా.. గడియపెట్టి ఉంది. ఆమె వెంటనే భర్తకు సమాచారం ఇచ్చింది. బాత్ రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా కుమారుడు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. దీంతో వారు షాక్ తిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. బట్టతల సమస్యతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ లో ఉంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
Also Read : 136మంది మగాళ్లను రేప్ చేశాడు : అమ్మాయిలే కాదు అబ్బాయిలూ జాగ్రత్త