TSPSC : టీఎస్పీఎస్సీలో 10 కొత్త పోస్టులు మంజూరు.. అదనపు కార్యదర్శిగా బీఎం సంతోష్

టీఎస్పీఎస్పీ అదనపు కార్యదర్శిగా బీఎం సంతోష్ నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి సంతోష్ టీఎస్పీఎస్సీ పరీక్షల కంట్రోలర్ గా వ్యవహరించనున్నారు.

TSPSC : టీఎస్పీఎస్సీలో 10 కొత్త పోస్టులు మంజూరు.. అదనపు కార్యదర్శిగా బీఎం సంతోష్

TSPSC (Photo : Google)

Updated On : April 22, 2023 / 7:21 AM IST

TSPSC : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీలో దిట్టుబాటు చర్యలు ప్రారంభించింది. టీఎస్పీఎస్సీలో పది కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.

పరీక్షల కంట్రోలర్, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్, జూనియర్ నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్, జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులతోపాటు జూనియర్ సివిల్ జడ్జి కేడర్ లో లా ఆఫీసర్ పోస్టుల మంజూరుకు టీఎస్పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పింపింది.

TSPSC: నియామక పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. రీ-షెడ్యూల్డ్ తేదీలు ఇవిగో..

ఈ మేరకు ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ పది కొత్త పోస్టులను మంజూరు చేసింది. అదేవిధంగా టీఎస్పీఎస్పీ అదనపు కార్యదర్శిగా బీఎం సంతోష్ నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి సంతోష్ టీఎస్పీఎస్సీ పరీక్షల కంట్రోలర్ గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు బీఎం సంతోష్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ బాధ్యతల నుంచి బీఎం సంతోష్ ను బదిలీ చేసింది.