గుడ్ న్యూస్: డిగ్రీ ఉంటే.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 100 ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : March 11, 2019 / 07:40 AM IST
గుడ్ న్యూస్: డిగ్రీ ఉంటే.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 100 ఉద్యోగాలు

బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నవారందరికి శుభవార్త. బ్యాంకులో ఉద్యోగం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నవారి కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, టెర్రిటరీ హెడ్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇప్పటికే 100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు 96 కాగా, టెర్రిటరీ హెడ్ పోస్టులు 4. దరఖాస్తు చేయడానికి మార్చి 29 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.
* వివరాలు:

                     పోస్టులు      పోస్టుల సంఖ్య          వయసు
  సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్              96    25 నుంచి 40 ఏళ్లు
  టెర్రిటరీ హెడ్            04    35 నుంచి 45 ఏళ్లు

* విద్యా అర్హత:
ఈ రెండు పోస్టులకు ప్రభుత్వ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ, విద్యాసంస్థ నుంచి డిగ్రీ ఉండాలి.
* ఎంపిక విధానం:
దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 2019 మార్చి 29 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసినవాళ్లు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను ప్రింటవుట్ తీసి భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం దాచుకోవాలి.
పరీక్ష ఫీజు:
– జనరల్, OBC అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.600.
– SC, ST, దివ్యాంగులకు రూ.100.