Job Vacancies : స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాలో 220 ఉద్యోగాల భర్తీ

భర్తీ చేయనున్న విభాగాలకు సంబంధించి ఆర్చరీ, అధ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్ బాల్ తదిగతర విభాగాలు ఉన్నాయి.

Job Vacancies : స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాలో 220 ఉద్యోగాల భర్తీ

Sai

Updated On : August 26, 2021 / 10:52 AM IST

Job Vacancies : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. వివిధ విభాగాల్లో మొత్తం 220 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ జారీచేశారు.

భర్తీ చేయనున్న విభాగాలకు సంబంధించి ఆర్చరీ, అధ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్ బాల్ తదిగతర విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాల్లో అసిస్టెంట్ కోచ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టుల విద్యార్హతల విషయానికి వస్తే సాయ్, ఎన్.ఎన్.ఐఎస్, దేశీయ,విదేశీయ యూనివర్శిటీల నుండి కోచింగ్ లోడిప్లోమా, ఒలంపిక్, ఇంటర్నేషనల్, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలైన వారు అర్హులు.

అసిస్టెంట్ కోచ్ పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు వయస్సు 40సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం క్రిడా విజయాలు, అనుభవం, విద్యార్హత, ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. 2021 అగస్టు 27 నుండి ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ధరఖాస్తుకు చివరితేది 2021 అక్టోబరు 10గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.sportsauthorityofindia.nic.in/