Bangalore Bel : బెంగుళూరు బెల్ లో 91 ఖాళీల భర్తీ

అభ్యర్ధుల వయస్సు 28ఏళ్లకు మించకుండా ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

Bangalore Bel : బెంగుళూరు బెల్ లో 91 ఖాళీల భర్తీ

Bengulur Bel (1)

Updated On : April 7, 2022 / 10:42 AM IST

Bangalore Bel : బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 91 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల ఖాళీలకు సంబంధించి ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీలు ఈఏటీ 66 పోస్టులు, టెక్నీషియన్ సీ 25 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్ధుల వయస్సు 28ఏళ్లకు మించకుండా ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుకలు చివరి తేదిగా ఏప్రిల్ 20, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.bel-india.in సంప్రదించగలరు.