Diploma Courses : హెల్త్ కేర్ లో పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
క్రిటికల్ కేర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ టెక్నాలజీ సెల్ఫ్ సపోర్డెడ్ కోర్సులుగా అందిస్తున్నారు. డిప్లొమాల కాల వ్యవధి ఏడాది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ, బీ.ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్‌లలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Mount Bromo
Diploma Courses : విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీకాకుళంలోని డా.బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీల్లో బొల్లినేని మెడ్‌స్కిల్స్ సహకారంతో అందించే హెల్త్ కేర్ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీకి సంబంధించి రెండు సంవత్సరాల పీజీ కోర్సు మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో కోర్సులో 40 సీట్లున్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ, కళాశాల నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. ఫీజుగాను ఏడాదికి రూ.45,000 గా నిర్ణయించారు..ఈ కోర్సుతోపాటుగా మరో మూడు పీజీ డిప్లొమా కోర్సులను అందించనున్నారు. క్రిటికల్ కేర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ టెక్నాలజీ సెల్ఫ్ సపోర్డెడ్ కోర్సులుగా అందిస్తున్నారు. డిప్లొమాల కాల వ్యవధి ఏడాది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ, బీ.ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్‌లలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో డిప్లొమాకు 15 చొప్పున సీట్లు కేటాయించారు. కోర్సు ఫీజు ఏడాదికి రూ.50,000 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్:www.audoa.in పరిశీలించగలరు.
అదే విధంగా శ్రీకాకుళంలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ రెండేళ్ల మాస్టర్ ఆఫ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్, ఏడాది వ్యవధి ఉన్న పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కోర్సులు నిర్వహిస్తోంది.ఒక్కో ప్రోగ్రామ్‌కు 40 చొప్పున సీట్లు కేటాయించారు. కనీస అర్హత: ఏదైనా డిగ్రీ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ, బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఏ, బీకాం,లో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. పూర్తి వివరాలకువెబ్‌సైట్: www.brau.edu.in/, www.bollinenimedskills.in పరిశీలించగలరు.