Ap Mega DSC-25: ఏపీ మెగా డీఎస్సీకి సర్వం సిద్ధం.. సెంటర్స్ లో కఠినమైన రూల్స్
ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఆఁధ్రప్రదేశ్ విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. జూన్ 6 నుంచి ఈ పరీక్షలు ప్రారంభమయ్యి జూలై 6వ తేదీ వరకు కొనసాగుతాయి.

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఆఁధ్రప్రదేశ్ విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. జూన్ 6 నుంచి ఈ పరీక్షలు ప్రారంభమయ్యి జూలై 6వ తేదీ వరకు కొనసాగుతాయి. నెల రోజులపాటు జరుగనున్న ఈ పరీక్షలను రోజుకు రెండు సెషన్ల వారీగా పూర్తి చేయనున్నారు. ఈమేరకు ఇప్పటికే హాల్ టికెట్లను జరీ చేయగా వాటిలో ఏమైనా తప్పులు ఉంటే పరీక్షా కేంద్రాలలోనే సరిచేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
పరీక్షల వివరాలు:
మొత్తం 154 కేంద్రాల్లో ఈ మెగా డీఎస్సీ పరీక్షలను జరుగనున్నాయి.
జూన్ 6 న మొదలయ్యే ఈ పరీక్షలు జూలై 6తో ముగుస్తాయి.
పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. కాబట్టి అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవడం మంచిది.
హాల్ టికెట్స్ లో ఏమైనా తప్పులు ఉంటే నామినల్ రోల్స్‌లో సరిచేస్తామని సూచించారు.
కొన్ని హాల్ టికెట్స్ లో అభ్యర్థుల ఫోటోలు లేవు. అలాంటివారు రెండు ఫోటోలను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఆధార్, ఓటరు, పాన్ కార్డు లాంటి గుర్తింపు కార్డులను వెంట తీసుకెళ్లడం మంచిది.
ఏపీ డీఎస్సీ పరీక్షల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా ప్రాంతాలలో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రిన్సిపల్, పీడీ, పీజీటీ పోస్టులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
ప్రిన్సిపల్, టీజీటీ, పీజీటీ అభ్యర్థులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నైపుణ్య పరీక్ష కోసం గంటన్నర సమయం కేటాయించారు.
అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 8121947387, 6281704160, 9398810958, 8125046997, 7995789286, 7995649286, 7013837359, 7995789286, 9963069286 హెల్ప్ లైన్ నంబర్స్ లో కాల్ చేయొచ్చు.
dscgrievances@apschooledu.in ఐడీకి మెయిల్ చేసి కూడా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ఈ మెగా డీఎస్సీలో భాగంగా మొత్తం 16,347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం 3,35,401 మంది అప్లయ్ చేసుకోగా అన్ని పోస్టులకు కలిపి 5,77,417 మంది అప్లై చేసుకున్నారు. కొణతమంది తమ అర్హతల మేరకు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు.