part time jobs : అమెజాన్ లో 1,10,000 ఉద్యోగాలు
పార్ట్ టైమ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అమెజాన్ శుభవార్త చెప్పింది. పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని భారతదేశంలో 1,10,000 సీజనల్ ఉద్యోగాలు కల్పిస్తోంది అమెజాన్.

Part Time Jobs
part time jobs : పార్ట్ టైమ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అమెజాన్ శుభవార్త చెప్పింది. పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని భారతదేశంలో 1,10,000 సీజనల్ ఉద్యోగాలు కల్పిస్తోంది అమెజాన్. ఇవి కొద్దీ రోజుల కాలపరిమితి కలిగిన జాబ్స్. ఈ ఫెస్టివల్ సీజన్ లో సెల్స్ అధికంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ నియామకాలు చేపడుతోంది అమెజాన్. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పూణె, చెన్నై, లక్నో, కోల్‌కతా లాంటి ప్రాంతాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కల్పిస్తోంది.
Read More : Divorce Party: పెళ్లికి బ్రేకప్..గ్రాండ్‌గా భారతీయ మహిళ విడాకుల పార్టీ
అమెజాన్ నెట్వర్క్‌లో అసోసియేట్స్‌గా అవకాశం కల్పిస్తోంది. ఆర్డర్స్ పిక్ చేయడం, ప్యాక్ చేయడం, షిప్పింగ్ చేయడం, కస్టమర్లకు డెలివరీ చేయడం లాంటి సేవల్ని అందించాల్సి ఉంటుంది. అమెజాన్‌లో డెలివరీ పార్ట్‌నర్ ఉద్యోగాలు కోరుకునేవారు Amazon Flex ప్లాట్‌ఫామ్ ద్వారా రిజిస్టర్ చేయొచ్చు. అమెజాన్ డెలివరీ పార్ట్‌నర్ రోజుకు 40 నుంచి 100 వరకు ఆర్డర్స్ డెలివరీ చేయొచ్చు. అమెజాన్ ఫ్లెక్స్ ద్వారా గంటకు రూ.120 నుంచి రూ.140 వరకు సంపాదించొచ్చు.
Read More : UPSC..నేషనల్ ఢిఫెన్స్,నావల్ అకాడమీ ఎగ్జామ్ కి మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు
ప్రాంతాన్ని బట్టి ఇది మారొచ్చు. అమెజాన్ డెలివరీ పార్ట్‌నర్‌గా మారాలంటే సొంత వాహనం ఉండాలి. అమెజాన్ ఫ్లెక్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://flex.amazon.in/ వెబ్‌సైట్ లేదా Amazon Flex యాప్‌లో తెలుసుకోవచ్చు.