Divorce Party: పెళ్లికి బ్రేకప్..గ్రాండ్‌గా భారతీయ మహిళ విడాకుల పార్టీ

ఎవరైనా పెళ్లి ఘనంగా జరుపుకుంటారు. బంధువుల్ని, స్నేహితుల్ని పిలిచి పార్టీ ఇస్తారు. కానీ ఓ భారతీయ మహిళ తన విడాకుల పార్టీని ఘనంగా జరుపుకుంది.

Divorce Party: పెళ్లికి బ్రేకప్..గ్రాండ్‌గా భారతీయ మహిళ విడాకుల పార్టీ

Indian Women Colourful Divorce Party

Indian women Colourful Divorce Party: ఎవరైనా పెళ్లి ఘనంగా జరుపుకుంటారు. బంధువుల్ని, స్నేహితుల్ని పిలిచి పార్టీ ఇస్తారు. కానీ ఓ మహిళ మాత్రం తన విడాకుల్ని ఘనంగా జరుపుకుంది.స్నేహితులకు పార్టీ ఇచ్చి మరీ సెలబ్రేట్ చేసుకుంది. ఈ విడాకుల పార్టీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఇటువంటివి పాశ్చత్యదేశాల్లో సర్వసాధరణమే. కానీ ఈ విడాకుల పార్టీ ఇచ్చింది ఓ భారతీయ మహిళ కావటం విశేషం. కానీ ఆమె పార్టీ ఇచ్చింది మాత్రం యూకేలో. అలాగని ఆమె పాశ్చత్యపోకడలకు పోయి..విడాకులు తీసుకుందని ఆ విడాకుల్ని పార్టీగా జరుపుకుందనే అనుకుంటే పొరపాటే. తన వైవాహిక బంధాన్ని నిలుపుకుందామని అనుకుంది. కానీ తన వ్యక్తిత్వానికే అది విఘాతం కలిగించే క్రమంలో కాంప్రమైజ్ కాలేకపోయింది ఫలితంగా 17 ఏళ్ల వివాహ బంధానికి మూడేళ్ల పోరాటం తరువాత ఎట్టకేలకు విడాకులు పొంది యూకేలో విడాకుల పార్టీతో సెలబ్రేట్ చేసుకుంది భారతీయ మహిళ సోనియా గుప్తా.

భారతీయ మహిళ సోనియా గుప్తా..
భారతదేశానికి చెందిన సోనియా గుప్తా స్వతంత్ర భావాలు కలిగిన మహిళ.వ్యక్తిత్వానికి విలువ ఇచ్చే మహిళ. తన మనసుకు నచ్చినట్లు జీవించాలనుకునే ధీర.అలాగని భర్తను గానీ అత్తింటివారిని గానీ నిర్లక్ష్యం చేసే వ్యక్తి కాదు. 2003లో పెద్దలు కుదిర్చిన వివాహంచేసుకున్న సోనియా..వివాహం తరువాత భర్తతో కలిసి లండన్‌ వెళ్లింది. అక్కడ ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది.

Read more : Bill Gates: బిల్ గేట్స్ దంపతుల సంచలన నిర్ణయం.. 27ఏళ్ల వైవాహిక జీవితంలో విడాకులు

అడుగడుగునా ఆంక్షలే..
భారత్ నుంచి యూకే వెళ్లిన సోనియాకు అడుగడుగునా భర్త ఆంక్షలు పెట్టేవాడు. అత్తింటివారు కూడా అంతే.దీంతో భార్యభర్తల మధ్య గొడవలు. చాలా భరించింది. ఎన్నో రకాలుగా సర్ధుకుపోవటానికి యత్నించింది. ఆమె ఎడ్జెస్ట్ అయ్యేకొద్దీ ఆంక్షలు పెరిగేవి. దీంతో ఇద్దరికి సెట్‌ అవ్వదని సోనియాకు అర్థం అయ్యింది. వివాహ బంధం నుంచి విడిపోవాలనుకుంది. కానీ ఆమె పుట్టింటివారికి అదో పెద్ద విషయంలా అనిపించింది. విడాకులు అనే మాటే వద్దన్నారు.ఆగ్రహం వ్యక్తంచేశారు. విడాకులు లేవు విస్తరాకులు లేవు..భర్త ఎలా ఉండమంటే అలా ఉండాలని చెప్పేవారు. కానీ సర్ధుకుపోవటానికే యత్నించినా ఫలితం లేదు. దీంతో పుట్టింటివారి మాటల్ని కూడా వినదలచుకోలేదు.తన వ్యక్తిత్వాన్నే పణ్ణంగా పెట్టినా బానిసలాగా పడి ఉండాలంటే తన వల్లకాదనుకుంది.అలా విడాకులకు అప్లై చేసింది. మూడేళ్ల తరువాత లీగల్ గా విడాకులు పొందింది. దీంతో ఆమె 17 ఏళ్ల తరువాత విడాకులు పొందిన సందర్భంగా హ్యీపీగా విడాకుల పార్టీ ఏర్పాటు చేసింది. ఫ్రెండ్స్ ను పిలిచింది. హ్యాపీగా ఎంజాయ్ చేసింది.

Read more : IAS Topper Divorce : రెండేళ్లకే విడాకులు తీసుకున్న IAS​ టాపర్లు

ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. ‘‘నేను నాలా ఉండాలనుకున్నాను. పెళ్లికి ముందు నేను చాలా యాక్టివ్ గా,సరదాగా ఉండేదాన్ని. అత్తింటి ఆంక్షల వాతావరణంలో ప్రతీ ఆడపిల్లలాగనే నేను కూడా ఇమడిపోవటానికి యత్నించాను.కానీ నా యత్నాలు ఫలించలేదు. దీంతో నాకు నరకంలా అనిపించేది. కలిసి ఉంటూ పోట్లాడుకుంటూ జీవితాల్ని నరకం చేసుకునే కంటే విడిపోయినా సంతోషంగా ఉండాలనుకున్నాను. అదే విషయం చెబితే నా పుట్టింటివారు ఒప్పుకోలేదు.సంప్రదాయాలు. పరువు అంటూ ఏవేవో చెప్పారు. నాకు ఎవరు మద్దతుగా ఉండలేదు. కానీ నా ఫ్రెండ్స్ మాత్రం నాకు మానసికంగా అండగా నిలిచారు. ధైర్యం చెప్పారు. ఆ స్ట్రగుల్స్ లో నా ఆరోగ్యం పాడైంది కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. దీంతో నేను విడాకులు తీసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నా..అలా మూడేళ్ల తరువాత విడాకులు లొచ్చాయి. ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనున్నానని..నాకు ధైర్యాన్నిచ్చి ఫ్రెండ్స్ తో కలిసి నా ఆత్మీయుల్ని పార్టీకి పిలిచ్చానని తెలిపింది.

నను స్ట్రగులు పడుతున్నప్పుడు నా స్నేహితులు మిఖాల్‌, షాయ్‌ నాకు అండగా నిలిచారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి సహాయం చేశారు. విడాకుల విషయంలో నాకు ఏషియన్‌ సింగిల్‌ పేరెంట్‌ నెట్‌వర్క్‌ నుంచి మద్దతు కూడా లభించింది. మూడేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత నాకు విడాకులు లభించాయి. 17 ఏళ్ల వైవాహిక బంధం నుంచి నాకు విముక్తి లభించింది’’ అని తెలిపారు.

Read  more : IAS Topper Divorce : రెండేళ్లకే విడాకులు తీసుకున్న IAS​ టాపర్లు

విడాకుల పార్టీ అందుకే..
విడాకులు వచ్చిన సందర్భంగా సోనియా గుప్తా తన లండన్‌ నివాసంలో గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేసింది. ఇక స్నేహితులతో కలిసి తన సంతోషాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది. ఆమె ధరించిన డ్రెస్‌ మీద ఫైనల్లీ డివోర్స్‌డ్‌ అనే ట్యాగ్‌ కూడా ధరించింది.‘నేను థీమ్‌ను రంగురంగులగా, ప్రకాశవంతంగా, యునికార్న్‌లతో నిండి సెలక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను కూడా నా జీవితం ఇలాగే ఉండాలని అనుకున్నాను. 10 సంవత్సరాల తర్వాత నా జీవితంలోకి సంతోషం తిరిగి వచ్చింది. ఆ సంతోషాన్ని ఇలా సెలబ్రెట్ చేసుకోవాలనుకున్నానని తెలిపింది.

సోనియా ఆశించినట్లుగా విడాకుల పార్టీలో జోష్ నింపేలా ప్రతి ఒక్కరూ ఆనందించడానికి బౌన్సీ కాసిల్‌, గులాబీ, ఊదా రంగులతో నిండిన డెకరేషన్స్ చేశారు. ఇంద్రధనస్సు, యునికార్న్ థీమ్‌తో పాటు కస్టమ్‌ కేక్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ విడాకుల పార్టీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.