Amazon Jobs : నిరుద్యోగులకు అమెజాన్ శుభవార్త
సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది అమెజాన్ వార్షిక జాబ్ ఫెయిర్ ప్రారంభంకానుంది. జాస్సీ ప్రకటించిన 55,000 కు పైగా ఉద్యోగాలలో 40,000 కంటే ఎక్కువ అమెరికాలో ఉంటాయి. మిగిలిన ఉద్యోగాలు

Amezon
Amazon Jobs : నిరుద్యోగ యువతకు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మంచి శుభవార్త అందించింది. అదేంటంటే రానున్న మాసాల్లో ప్రపంచవ్యాప్తంగా 55వేల మంది ఉద్యోగులను తమ సంస్ధలో నియామకం చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇదే విషయాన్ని అమెజాన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీ జాస్సీ రాయిటర్స్ కు తెలిపారు. సీఈఓ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆయన రాయిటర్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో అమెజాన్ రిటైల్, క్లౌడ్ విభాగాల్లో సంస్ధకు పెద్ద ఎత్తున సిబ్బంది అవసరమని చెప్పారు. బ్రాడ్ బ్రాండ్ ఇంటర్నేట్ సేవలకు సంబంధించి ప్రాజెక్ట్ కైపర్ కు , ఉపగ్రహాలను క్షక్యలోకి ప్రవేశపెట్టడానికి సిబ్బందిని తీసుకోనున్నట్లు చెప్పారు.
సెప్టెంబర్ 15 నుంచి అమెజాన్ వార్షిక జాబ్ ఫెయిర్ ప్రారంభంకానుంది. జాస్సీ ప్రకటించిన 55,000 కు పైగా ఉద్యోగాలలో 40,000 కంటే ఎక్కువ అమెరికాలోని తమ సంస్ధల్లో భర్తీ చేస్తారు. మిగిలిన ఉద్యోగాలు భారతదేశం, జర్మనీ, జపాన్ వంటి దేశాలలో ఉన్నాయి. కరోనా పరిస్ధితుల నేపధ్యంలో చాలా మంది ఉపాధిలేక తీవ్ర ఇబ్బందులు చవి చూస్తున్నారు. ఈక్రమంలో ఉద్యోగ నియామకాలు చేపట్టటం ద్వారా వారికి ఉపాధి చూపించేందుకు మంచి సమయమని అమెజాన్ సంస్ధ బావిస్తోంది. కొత్త ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగులకు ఒకరకంగా అమెజాన్ చేపట్టనున్న కెరీర్ డే ఆలోచనతో ఉపాధి చేకూరుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కొత్త నియామకాలు వల్ల అమెజాన్ టెక్, కార్పొరేట్ సిబ్బంది 20 శాతం పెరగనున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2,75,000 మంది పనిచేస్తున్నారని కంపెనీ తెలిపింది.