కీలక ఒప్పందం కుదుర్చుకున్న వర్సిటీ.. విద్యార్థులు చదువుకుంటూనే ఉద్యోగం చేయొచ్చు.. రూ.24 వేల వరకు జీతం.. ఈ ప్రోగ్రాంలో చేరతారా?
ప్రోగ్రాంకు సంబంధించిన వివరాలను విశ్వవిద్యాలయ వెబ్‌పోర్టల్‌లో త్వరలోనే పెడతామని చెప్పారు.

రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఏఎస్‌సీఐ) కంపెనీ ఎగ్జిక్యూటివ్ హెడ్ జెమ్స్ రాఫెల్‌తో అంబేద్కర్ వర్సిటీ ఓ ప్రోగ్రాంకు సంబంధించిన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు చదువుకుంటూనే ప్రతి నెల పనిచేస్తూ జీతం పొందేలా ఈ ఒప్పందం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి తెలిపారు.
ఆర్‌ఏఎస్‌సీఐతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న మొదటి విశ్వవిద్యాలయం తమదేనని ఘంటా చక్రపాణి చెప్పారు. స్టూడెంట్లు అందరికీ విద్యతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించడం లేదంటే వారిని వ్యాపారవేత్తలుగా చేయడమే తమ లక్ష్యమన్నారు.
Also Read: ఉన్నట్టుండి మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో ఎంత పెరిగాయంటే?
ఈ ప్రోగ్రాంలో చేరితే ప్రతి నెల రూ.7 వేలు- రూ.24 వేల మధ్య సంపాదించుకునే అవకాశం ఉంటుందని ఘంటా చక్రపాణి తెలిపారు. చదువుకుంటున్న విద్యార్థులేకాకుండా 28 ఏళ్ల వయసు నిండి అంబేద్కర్ వర్సిటీ నుంచి ఇప్పటికే డిగ్రీ పూర్తిచేసిన వాళ్లు కూడా ఈ ప్రోగ్రాంలో చేరవచ్చని తెలిపారు.
ప్రోగ్రాంకు సంబంధించిన వివరాలను విశ్వవిద్యాలయ వెబ్‌పోర్టల్‌లో త్వరలోనే పెడతామని చెప్పారు. స్టూడెంట్లలో స్కిల్స్ పెంచుతూ, ఉపకారవేతన ఆధారిత విద్యను అందించనున్నట్లు తెలిపారు.