చెక్ ఇట్ : ఏపీ టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే

  • Published By: veegamteam ,Published On : February 12, 2019 / 04:48 AM IST
చెక్ ఇట్ : ఏపీ టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే

Updated On : February 12, 2019 / 4:48 AM IST

ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదలైంది. మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో సోమవారం (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 2 వరకు పరీక్షలు కొనసాగుతాయని మంత్రి తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షలు పూర్తయిన నెలరోజుల్లోనే ఫలితాలను వెల్లడిస్తామని మంత్రి గంటా స్పష్టం చేశారు. 

పరీక్షల సమయం:
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

పరీక్షల షెడ్యూలు:
        సబ్జెక్టు                         పరీక్ష తేదీ
తెలుగు (పేపర్-1)          –       మార్చి 16 
తెలుగు (పేపర్-2)          –      మార్చి 18
హిందీ                         –      మార్చి 19 
ఇంగ్లిష్ (పేపర్-1)            –      మార్చి 20 
ఇంగ్లిష్ (పేపర్-2)            –      మార్చి 22 
మ్యాథమెటిక్స్ (పేపర్-1)    –      మార్చి 23 
మ్యాథమెటిక్స్ (పేపర్-2)    –      మార్చి 25 
జనరల్ సైన్స్ (పేపర్ -1)     –      మార్చి 26 
జనరల్ సైన్స్ (పేపర్-2)      –      మార్చి 27 
సోషల్ స్డడీస్ (పేపర్-1)       –      మార్చి 28 
సోషల్ స్డడీస్ (పేపర్-2)       –      మార్చి 29 

విద్యార్థులు ఉదయం 8.45 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభం అయ్యాక మరో 5 నిమిషాల వరకే గ్రేస్ పీరియడ్ ఉంటుందని, ఆ లోపు మాత్రమే లోపలికి అనుమతిస్తామని తెలిపారు.