AP EAPCET 2024 Exam : ఏపీ `ఈఏపీసెట్` పరీక్షలపై విద్యార్థులకు బిగ్ అలర్ట్.. కొత్త తేదీలివే!

AP EAPCET 2024 Exam : తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈఏపీసెట్ (పాత ఎంసెట్) పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది.

AP EAPCET 2024 Exam : ఏపీ `ఈఏపీసెట్` పరీక్షలపై విద్యార్థులకు బిగ్ అలర్ట్.. కొత్త తేదీలివే!

AP EAPCET 2024 Exam Postponed: Impact of Elections on Exam Dates

AP EAPCET 2024 Exam : దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో ఈఏపీసెట్ (పాత ఎంసెట్) పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ జరుగనుంది. జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈఏపీసెట్ (పాత ఎంసెట్) పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. మే 13వ తేదీన ఏపీలో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఆ రోజు జరగాల్సిన ఈఏపీసెట్ పరీక్షలను మే 16కు వాయిదా వేశారు.

Read Also : UPSC Prelims Reschedule : ఎన్నికల వేళ.. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా.. జూన్ 16న పరీక్ష!

మే 16 నుంచి మే 22 తేదీల్లో పరీక్షలు :
కొత్త షెడ్యూల్ ప్రకారం.. మే 16, మే 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక, మే 18 నుంచి మే 22 వరకు ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రతి ఏడాదిలో అగ్రికల్చర్, ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈఏపీసెట్ నిర్వహిస్తోంది. మే 18 (సెషన్‌-1), మే 19 (సెషన్‌ -2), మే 20, మే 21, మే 22 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ఏపీ పీజీసెట్‌ పరీక్ష కూడా జూన్‌ 3 నుంచి జూన్ 7 వరకు జరగాల్సి ఉంది. ఈ పరీక్షల తేదీలను కూడా జూన్‌ 10, జూన్ 11, జూన్ 12, జూన్ 13, జూన్ 14 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీలోని యూనివర్శిటీల్లో పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే ఆర్‌సెట్‌ కూడా షెడ్యూల్‌ ఖరారు అయింది. మే 2 నుంచి మే 5 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటనలో పేర్కొంది.

Read Also : Bihar Teacher Recruitment : పేపర్ లీక్ కలకలం.. బీహార్ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష రద్దు!