AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ కౌన్సిలింగ్.. ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

AP EAPCET 2025: ఈఏపీసెట్ 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల చేశారు అధికారులు.

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ కౌన్సిలింగ్.. ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

AP EAPSET 2025 Final Phase Counseling Schedule Released

Updated On : July 25, 2025 / 12:19 PM IST

ఆంధ్రప్రదేశ్ లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ఈఏపీసెట్ 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల చేశారు అధికారులు. ఈ ప్రక్రియ ఆదివారం(జులై 27) నుంచి మొదలుకానుందని ఏపీ ఉన్నత విద్యామండలి అధికారిక ప్రకటన చేసింది. జులై 27న మొదలుకానున్న తుది విడత కౌన్సలింగ్ ప్రక్రియ జులై 30వ తేదీతో ముగియనుంది.

దీనికి సంబదించిన రోజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జులై 27 నుంచే మొదలవుతుండగా జులై 28వ తేదీ నుంచి 30వ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగనుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జులై 28 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్‌కు అనుమతి ఇస్తారు. ఆగస్టు 1న వెబ్ ఆప్షన్ల మార్పు, ఆగస్టు 4న సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 4వ తేదీ నుంచి 8 వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి.

ఆగస్టు 4 నుంచి ఇంజినీరింగ్ కాలేజీలో తరగతులు మొదలవుతాయి. దీనిపై మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://eapcet-sche.aptonline.in/EAPCET/ ను సంప్రదించవచ్చు. ఇక ఈ సంవత్సరం ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 1,89,748 మంది విద్యార్థులు అర్హత సాధించారు.