AP EDCET- 2019 ప్రవేశ ప్రకటన విడుదల

‘AP EDCET-2019’ ప్రవేశ ప్రకటన విడుదలైంది. 2019-20 సంవత్సరానికిగాను ఎడ్యుకేషన్ కళాశాలల్లో రెండేళ్ల B.ED కోర్సులో ప్రవేశానికి సంబంధించి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదలచేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు EDCET-2019 దరఖాస్తుకు అర్హులు.
Read Also : 10th క్లాస్ స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్ : ఒక్క నిమిషం నిబంధన లేదు
* దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మార్చి 14 నుంచి ఏప్రిల్ 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
* దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. SC, ST అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది. రూ.500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 29 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
* పరీక్ష వివరాలు:
EDCET-2019 పరీక్షను మే 6న నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు.
* కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.ED).
* ముఖ్యమైన తేదీలు..
– ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 14.03.2019
– ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 24.04.2019
– దరఖాస్తుకు చివరితేదీ: 29.04.2019.
– EDCET పరీక్ష తేదీ: 06.05.2019.