ఏపీ పాలిసెట్-2019 ఫలితాలు.. టాపర్లు వీరే

  • Published By: veegamteam ,Published On : May 9, 2019 / 09:34 AM IST
ఏపీ పాలిసెట్-2019 ఫలితాలు.. టాపర్లు వీరే

Updated On : May 9, 2019 / 9:34 AM IST

ఏపీలో పాలిసెట్-2019 ఫలితాలు గురువారం (మే 9)న ఉదయం 11 గంటలకు విజయవాడలో సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌ పండాదాస్‌ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,24,899 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వీరిలో 84.33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 

ఫలితాల్లో మొదటి పది ర్యాంకుల్లో ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు బాలికలు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చింత శివ మాధవ్ మొదటి ర్యాంకు, ఫణి హిరంభనాథ్ రెండో ర్యాంకు మూడో ర్యాంకును చందనం విష్ణు సాధించారు. జూన్ 6 పాలిసెట్ తరగతులు ప్రారంభం కానున్నాయి.

ఏపీలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 30న‌ నిర్వహించిన  ప్రవేశ పరీక్షకు మొత్తం 1,31,931 దరఖాస్తు చేసుకోగా 1,24,899 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో మొత్తం 84.33 శాతం మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వీరికి మే 24 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.