Apollo Job Mela: పది పాసైనవారికి బంపర్ ఆఫర్.. అపోలోలో అద్భుత అవకాశాలు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం
Apollo Job Mela: ప్రముఖ సంస్థ అపోలో తమ సంస్థలో పలు విభగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు భారీ జాబ్ మేళా నిర్వహించనుంది.

Apollo Hospitals' huge job fair in Anantapur district
పది లేదా ఆపై చదువులు పూర్తి చేసినవారికి అధ్భుతమైన అవకాశం. ప్రముఖ సంస్థ అపోలో తమ సంస్థలో పలు విభగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు భారీ జాబ్ మేళా నిర్వహించనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ భారీ ఉద్యోగ మేళా జరుగనుంది. ఈ జాబ్ మేళాలో భాగంగా అపోలో ఫార్మసిస్ట్ / సీనియర్ ఫార్మసిస్ట్, రీటైల్ ట్రైనీ అసోసియేట్, బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్, స్టోర్ మేనేజర్, డెలివరీ బాయ్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. కాబట్టి, ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని అధికారులు సూచించారు.
ఉద్యోగం, భాద్యతలు :
అపోలో ఫార్మసిస్ట్ / సీనియర్ ఫార్మసిస్ట్: ప్రిస్క్రిప్షన్‌లను తనిఖీ చేయడం, మందులు ఇవ్వడం, పేషేంట్స్ కి మందుల వాడకం గురించి చెప్పడం వంటి పనులు ఉంటాయి.
రీటైల్ ట్రైనీ అసోసియేట్: వీరు కస్టమర్ సర్వీస్, స్టాక్ నిర్వహణ, బిల్లింగ్, వంటి పనులు ఉంటాయి.
ఫార్మసీ అసిస్టెంట్: ఫార్మసిస్ట్‌లకు సహాయం చేయడం, స్టాక్ నిర్వహించడం, కస్టమర్‌లకు సహాయం చేయడం వంటి పనులు ఉంటాయి.
బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్: వీరు బిల్లింగ్ కు సంబందించిన పనులు చూసుకుంటారు.
స్టోర్ మేనేజర్: వీరు స్టోర్ నిర్వహణ, సిబ్బంది పర్యవేక్షణ, అమ్మకాలు వంటి పనులు చూసుకోవాలి.
డెలివరీ బాయ్: ఆర్డర్ చేసిన మందులను హోమ్ డెలివరీ చేయడం వీరి భాద్యత.
విద్యార్హత:
టెన్త్ నుంచి నుంచి డిగ్రీ, బి.ఫార్మసీ, డి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ చదువులను పూర్తి చేసిన ప్రతీ ఒక్కరు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
వయోపరిమితి:
ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి(పోస్టులను బట్టి మారే అవకాశం ఉంది)
అవసరమైన ధ్రువపత్రాలు:
మీ రెజ్యూమె, ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటోలను తీసుకొని రావాలి.
ఎంపిక విధానం:
ఎలాంటి రాత పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది.
జాబ్ మేళా వేదిక:
అపోలో ఫార్మసీ బ్రాంచ్ యాదవ వీధి, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ధర్మవరం.