RRB Recruitment 2025: ఆర్ఆర్‌బీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు.. లాస్ట్ డేట్ వివరాలు ఇవే
RRB Recruitment 2025: ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ పోస్టుల దరఖాస్తు గడువును పొడిగించారు.

Application deadline for RRB Technician posts extended
ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 6238 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జులై 28 వరకు అవకాశం ఇచ్చారు. కానీ, తాజాగా ఆ డేట్ ను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ పోస్టుల దరఖాస్తు గడువును 2025 ఆగస్టు 7 వరకు పొడిగించారు. కాబట్టి నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు 183, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులు 6055
వయోపరిమితి:
టెక్నీషియన్ గ్రేడ్-1 అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి.
టెక్నీషియన్ గ్రేడ్-3 అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఇతర అర్హత కలిగిన అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
వేతన వివరాలు:
టెక్నీషియన్ గ్రేడ్ I పోస్టులకు ఎంపికైన వారికి ప్రారంభవేతనం రూ.29,200
టెక్నీషియన్ గ్రేడ్ III పోస్టులకు ఎంపికైన వారికి ప్రారంభ వేతనం రూ.19,900 ఉంటుంది.
ఎంపిక విధానం:
ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ ఎంపిక విధానంలో రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటాయి.