AP Forest Jobs: ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలు.. నెలకు లక్ష జీతం.. దరఖాస్తులు ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి

AP Forest Jobs: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

AP Forest Jobs: ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలు.. నెలకు లక్ష జీతం.. దరఖాస్తులు ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి

Applications for Section Officer posts in AP Forest Department have started.

Updated On : July 31, 2025 / 10:04 AM IST

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 100 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన ఈ నోటిఫికేషన్ ను సంబందించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలయ్యింది. కాబట్టి, అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్ట్ 17వ తేదీలోపు అధికారిక వెబ్ సైట్ https://portal-psc.ap.gov.in/Default నుంచి అప్లై చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ పూర్తి వివరాలు:

విద్యార్హతలు:

వృక్షశాస్త్రం/ఫారెస్ట్/హార్టీ కల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ/మ్యాథ్స్, స్టాటిస్టిక్స్/జియాలజీ/అగ్రికల్చర్ ఒక సబ్జెక్ట్ గా డిగ్రీ పాసై ఉండాలి.

ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష:

అభ్యర్థులు కచ్చితంగా 163 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.
చాతీ 84 Cms ఉండాలి.. గాలి పీల్చినప్పుడు 5 Cms పెరగాలి.
మహిళా అభ్యర్థుల ఎత్తు 150 Cms ఉండాలి
చాతీ చుట్టుకొలత 79 Cms తగ్గకుండా గాలి పీలిచినప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి.

దరఖాస్తు రుసుము:

అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కోసం రూ. 250, పరీక్ష ఫీజు రూ. 80 చెల్లించాల్సి ఉంటంది.

వయోపరిమితి:

అభ్యర్థుల వయసు 01.07.2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతన వివరాలు:

ఈ ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 32,670 నుంచి రూ.1,01,970 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం:

స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ టెస్ట్. కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉంటాయి.

దరఖాస్తు ఇలా చేసుకోండి:

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో ఆన్ లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థి ఓటీఆర్ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  • ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి
  • ఇక్కడ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజును చెల్లించి ప్రాసెస్ పూర్తి చేయాలి.
  • తరువాత ఫారంను సబ్మిట్ చేసి ప్రింట్/డౌన్లోడ్ చేసుకోవాలి.