ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం దరఖాస్తు చేసుకోండి

మార్చి 30న ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ఫ్ సెంటర్‌లో (AOC) నిర్వహించనున్న ర్యాలీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, పుదిచ్ఛేరి (UT)లకు చెందిన అభ్యర్థులు సోల్జర్స్(ఫార్మా) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ (www.joinindianarmy.nic.in)లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు తేది:
– ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు.
– మార్చి 22వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అడ్మిట్ కార్డులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.
– మార్చి 23 నుంచి అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోని ప్రింట్ తీసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
– ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.